Political News

ఎంపీ అవినాశ్ కు డ్రైవర్ దస్తగిరి సవాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందన్నది తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీలో రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే.. ఆదివారం పులివెందులలో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డినే. ఆదివారం సాయంత్రం వేళలో సీబీఐ నుంచి తాఖీదులు అందుకున్న అవినాశ్.. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేదు.

ఇదిలా ఉంటే.. ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ కేసులో నిందితుడు కమ్ అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం తప్పించి మరేమీ ఆధారాలు లేవని అవినాశ్ వాదిస్తున్నారు. దస్తగిరిని సీబీఐ చిత్రహింసలకు గురి చేసి తమ పేర్లను చెప్పినట్లుగా వాదించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోపణల నేపథ్యంలో దస్తగిరి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన సవాలు విసిరారు. వివేకా హత్య కేసులో ఎదుర్కొంటున్న ఆరోపణలు తేలి.. జైలుకు పంపితే వెళతారా? ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సూటి సవాలు విసిరాడు. తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి ప్రాణహాని పొంచి ఉందన్నారు.

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారటాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారని చెప్పిన దస్తగిరి.. ‘‘మరి నేను అప్రూవర్ గా మారే సమయంలో అవినాశ్ రెడ్డి లాంటోళ్లు ఎందుకు విమర్శించలేదు. ఎందుకు ప్రశ్నించలేదు. మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు. ఇప్పుడు మాత్రం చెడ్డోడు అయ్యాడా? సునీత నుంచి కానీ సీబీఐ నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బు తీసుకున్నది లేదు. అలా తీసుకున్నట్లు రూపాయి చూపించినా.. జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధం’’ అని పేర్కొన్నారు.

ఎర్ర గంగిరెడ్డి చెబితే.. డబ్బులకు ఆశపడి హత్య చేశామని.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదన్నారు. ‘‘పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రాంసింగ్ ను మార్చేశారు. రామ్ సింగ్ మార్చితే కొత్త అధికారి కొత్త కోణంలో విచారిస్తారా? వివేకా కేసులో మీ పాత్ర ఉందని తెలుసు కాబట్టే.. ఏ అధికారి అయినా ఒకేలా దర్యాప్తు చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేశానని.. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి సిద్ధమైనట్లు గా దస్తగిరి పేర్కొన్నారు.
తనను పారిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. కానీ తానెక్కడికి పారిపోనని పేర్కొన్నారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నారన్న దస్తగిరి.. ‘‘నేను తప్పు చేస్తే కచ్చితంగా జైలుకు వెళతాను. మరి మీరు (అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి) తప్పు చేస్తే జైలుకు కూడా వెళ్తాను. మరి.. మీరు తప్పు చేసినట్లు రుజువైతే.. రాజీనామా చేస్తారా? మీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ సవాలు విసిరారు. తాను పులివెందుల వైఎస్ జయమ్మ కాలనీలోనే ఉన్నానని.. ఎక్కడికి పారిపోలేదని దస్తగిరి స్పష్టం చేశారు.

This post was last modified on April 18, 2023 8:37 am

Share

Recent Posts

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

1 hour ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

1 hour ago

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…

2 hours ago

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

2 hours ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

4 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

4 hours ago