ఆ మాట చాలా మంది చెప్పారు.. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలని పెద్దలు చాలా మంది ఆకాంక్షించారు. అది మాటయినా, కోరికైనా, డిమాండ్ అయినా ఇప్పటి దాకా కోల్డ్ స్టోరీజీలోనే ఉండిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ సభలో ప్రకాశ్ అంబేడ్కర్, హైదరాబాద్ రాజధాని అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. ఆయన స్వయంగా బాబా సాహెబ్ మనుమడు. రాజకీయా వారసత్వాన్ని, మేథావి లక్షణాలను పుణికి పుచ్చుకున్న నాయకుడు..
అందరికీ ఆమోదయోగ్యం
ఎక్కడనుంచి వచ్చారని చూడకుండా, మీరెవరని అడగకుండా అందరినీ అక్కున చేర్చుకునే నగరం హైదరాబాద్. ఢిల్లీ తరహాలో భాగ్యనగరంలో కాలుష్యం ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఆర్థికవేత్తలే నిర్ధారించారు. దేశానికి రెండో రాజధాని కావాలన్నప్పుడల్లా రెండు మూడు నగరాల పేర్లు ప్రస్తావనకు వస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటూ పేర్లు చదవడం మొదలు పెడతారు. అయితే జనంలో మాత్రం హైదరాబాద్ పట్లే మొగ్గు ఎక్కువగా ఉంటుంది. పైగా నగర విస్తరణకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ హైదరాబాద్ లో కావాల్సినంత ఉంది..
చెన్నై, బెంగళురు వరదలు పారే నగరాలు. హైదారాబాద్ కు ఆ భయం లేదు. పైగా భూకంప కేంద్రానికి హైదరాబాద్ దూరంగా ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. సాఫ్ట్ వేర్ పరిశ్రమకు తిరుగులేని నగరం. భద్రతా పరంగా కూడా హైదరాబాద్ సురక్షితమైన నగరం. ఢిల్లీ మహానగరం దేశ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ అలా కాదు. తీరానికి, సరిహద్దులకు దూరంగా సురక్షితమైన నగరమే హైదరాబాద్. సాంస్కృతికంగా, శాంతి భద్రతల అంశంలోనూ హైదరాబాద్ నెంబన్ వన్ అని చెప్పాలి..
అంబేద్కర్ ఆనాడే చెప్పారు..
బాబాసాహెబ్ అంబేడ్కర్ 1955లో థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం రాశారు. 11వ అధ్యాయం మొత్తం దేశ రెండో రాజధాని హైదరాబాద్ అంటూ ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీని వల్ల ఉత్తరం, దక్షిణం మేళవింపు సాధ్యమన్నారు. ఢిల్లీ కంటే సురక్షితమైనదీ హైదరాబాద్ అంటు కుండబద్దలు కొట్టారు.
కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారా..
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి సెకెండ్ కేపిటల్ చేయాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా వినిపిస్తోంది. రెండో రాజధాని ప్రతిపాదనకు బీఆర్ఎస్ ఒప్పుకునే అవకాశాలున్నాయి. అయితే హైదరాబాద్ లేని తెలంగాణను మాత్రం ఊహించడం కష్టమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి కేంద్రం ఎలా నరుక్కు వస్తుందో చూడాలి. ఏదేమైనా ఏడు దశాబ్దాల తర్వాతైనా అంబేడ్కర్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.. తెలుగు వారికి కూడా మంచిదే కదా…
This post was last modified on April 15, 2023 12:22 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…