టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలపై కన్నెర్ర చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విధానాలను మాత్రమే విమర్శిస్తూ..వచ్చిన చంద్రబాబు ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మూడు జిల్లాల పర్యటన నిమిత్తం ఏపీలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. మరోవైపు పార్టీలోకట్టుతప్పుతున్న నేతలకు గట్టివార్నింగే ఇచ్చారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాళ్లబేరానికి వస్తామని అనుకుంటున్నారేమో.. మనది వైసీపీ కాదు.. అని హెచ్చరించారు.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. విశాఖలో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని పోవాలని, కొందరు విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు.
విభేదాలు సృష్టించాలని చూసేవారికి, గ్రూపులు కట్టిన వారికి పదవులు రావని.. టికెట్లు కూడా కష్టమేనని చంద్రబాబు స్పష్టంచేశారు. పార్టీ బలోపేతం కోసం బయటివాళ్లు వస్తే చేర్చుకోవలసిన అవసరముందని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, ఈ విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
“ప్రభుత్వం పోరాడమంటే కొందరు నాయకులు.. ఇళ్లలో పోరాటాలు చేస్తున్నారు. పోలసులను ఇళ్లకు పిలిపించుకుని తమకు తామే గృహ నిర్బంధాలు చేయించుకుంటున్నారు. నాకు తెలియదని అనుకుంటున్నారు. అన్నీ గమనిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి” అని కొందరు నాయకులను పేరు చెప్పకుండానే చంద్రబాబు హెచ్చరించారు. ఇది ఒక అవకాశమని.. దీనిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుదామని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on April 6, 2023 10:30 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…