నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే.. వైసీపీ రెబల్ నాయకుడు.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గురువారం తెల్లవారు జామునే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్న సుమారు 50 మంది పోలీసులు.. ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు రారాదని అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ విషయం ఉదయం 6 గంటలకు కానీ,… బయటకు రాలేదు.
దీంతో విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి అభిమానులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇంటికి చేరుకున్నారు. కోటంరెడ్డికి అనుకూలంగా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకు తనను నిర్బంధించారో.. చెప్పాలని కోటంరెడ్డి ప్రశ్నించారు. అయితే.. పోలీసులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. తాము నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.
ఇదీ.. విషయం
నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లెం కలుజు రిపేర్లు కోసం గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు దీనిపై ఆయన స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్ష చెట్టెందుకు సిద్దమయ్యారు.
అయితే.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కోటంరెడ్డి దీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే కోటంరెడ్డి దీక్ష చేపట్ట కుండా తెల్లవారుజామున ఆయనను హౌస్ అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చేరు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటి వద్ద పోలీసులు, కార్యకర్తలు భారీగా మోహరించారు.
This post was last modified on April 6, 2023 10:26 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…