Political News

విజయవాడ కాదు వైజాగ్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా…

2022 డిసెంబరు 9న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పటి నుంచి కేసీఆర్ పొరుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ 12 జెడ్పీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ ఆశలు వదులుకున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. జనవరి 2న కొందరు ఏపీ నేతలు వచ్చి బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఎలాంటి క్రియాశీల కార్యక్రమమూ జరగకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి…

ఏప్రిల్ 3వ వారంలో…

అనుమానాలకు తెరదించుతూ ఏపీ వైపుకు దూసుకుపోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నెల 3వ వారంలో వైజాగ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను మంత్రి శ్రీవివాస యాదవ్ కు అప్పగించినట్లు చెబుతున్నారు. తొలుత విజయవాడలోనే సభ ఏర్పాటు చేయాలని భావించిన ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆలోచన మారినట్లు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వైజాగ్ కేపిటల్ నినాదానికి మద్దతు లేదన్న నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చిందట. దానితో అమరావతి రాజధాని నినాదానికే పరోక్షంగా మద్దతివ్వాలని భావిస్తోందట. విజయవాడ కంటే విశాఖలో సభ పెడితే ఒడిశా నుంచి కూడా కేడర్ ను తీసుకువచ్చే వీలుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ కూడా విశాఖలో సభ పెట్టాలని సూచించినట్లు చెబుతున్నారు…

విశాఖ ఉక్కుకు మద్దతు…

టార్గెట్ వైజాగ్ గా బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్న తరుణంలో ఉక్కు కర్మాగారానికి మద్దతిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆయన వ్యతిరేకిస్తున్నారు. లక్షన్నర కోట్ల కంపెనీని కారు చౌకగా ప్రైవేటుకు అప్పగించే చర్యలను అందరూ వ్యతిరేకించాలని ఆయన కోరుతున్నారు. వర్కింగ్ కేపిటల్ కోసం కేంద్రమే నిధులు విడుదల చేయడంతో పాటు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన అంటున్నారు. పైగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలిసి వారి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను పార్టీ అధిష్టానం ఆదేశించింది. మరి బీఆర్ఎస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి….

This post was last modified on April 4, 2023 10:53 am

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

2 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

3 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 hours ago