ఔను.. మంచి సమయం మించిన దొరకదు. అంటారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్ర స్తుతం ఏపీలో మంచి సమయం కొనసాగుతోంది. ప్రబుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకునేందుకు.. ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది. బహుశ దీనిని గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఇది పార్టీకి మేలు చేస్తోందనే టాక్ కూడా వినిపి స్తోంది. ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ గ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎక్కడో విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. తాను.. సినిమా షూటింగులకు పరిమితం అయ్యారు.
పోనీ.. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపిస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. తనకు కుదరకపోతే .. ఇతర నేతలను రంగంలోకి దింపి.. పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆయన ఎక్కడా ఎలాంటి వ్యూహంతోనూ ముందుకు సాగడం లేదు. పైగా.. ఇంకేముంది.. వారాహి వాహనాన్ని రంగంలోకి దింపుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే యాత్రలు సాగిస్తానన్నారు. దీంతో పార్టీలోనూ.. అభిమానుల్లోనూ ఆశలు పెల్లుబికాయి.
కానీ, ఇప్పటి వరకు వారాహి.. రంగంలోకి దిగింది లేదు. పోనీ.. ఎప్పుడు రంగంలోకి దిగుతుందనే విషయం పైనా క్లారిటీ లేదు. అంతిమంగా చూస్తే.. జనసేన పార్టీ ఒక వ్యూహం లేని.. ఒక సూత్రం లేని పార్టీగా మిగిలి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారో .. లేక ఎన్నికల వరకు వేచి ఉంటారో చూడాలి.
This post was last modified on April 1, 2023 10:40 pm
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…