కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. విచారణ సందర్భంగా తనపై సీబీఐ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని అవినాష్ పిటీషన్ వేశారు. అయితే రెండు పిటీషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణలో తాము ఏరకంగాను జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ఇక్కడ అవినాష్ ఉద్దేశ్యంలో తీవ్రమైన చర్యలంటే అరెస్టనే అర్ధం.
ఇదే విషయమై అవినాష్ కు కోర్టు స్పష్టంగా చెప్పేసింది. విచారణలో భాగంగా ఒకవేళ సీబీఐ గనుక అవినాష్ ను అరెస్టు చేయాలని అనుకున్నా తాము జోక్యం చేసుకునేది లేదని చెప్పేసింది. దాంతో ఇపుడు అవినాష్ ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో విచారణ సందర్భంగా తన లాయర్ ను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలనే విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించింది. ఎంపీని విచారించేటపుడు ఆయన లాయర్ ను కూడా అనుమతించాలని చెప్పింది.
అయితే లాయర్ ను దూరంగా కూర్చోబెట్టాలని కూడా కోర్టు ఆదేశించింది. హోలు మొత్తంమీద అవినాష్ కు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదనే చెప్పాలి. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీ అవినాష్ ను సీబీఐ అనుమానితుడిగానే విచారిస్తోంది. ఇదే సమయంలో అవినాష్ ను సీబీఐ సాక్షిగా విచారిస్తోందని స్వయంగా సీబీఐ లాయరే కోర్టు విచారణలో చెప్పారు. మరి రెండు వాదనల్లో ఏది నిజమనేది అయోమయంగా తయారైంది.
ఏదేమైనా వివేకా మర్డర్ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయచ్చని ఎంపీ అనుకుంటున్నది వాస్తవం. మరి తాజా కోర్టు తీర్పు ప్రకారం సీబీఐ అవినాష్ విషయంలో దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఎంపీని నాలుగుసార్లు విచారించింది. ఇంకెన్నిసార్లు విచారిస్తుందో సీబీఐకే తెలియాలి. మొత్తానికి ఎంపీలో అరెస్టు భయం కోర్టు తీర్పు నేపధ్యంలో ఇంకా పెరిగిపోతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. చివరకు ఏమవుతుందో తెలీదు కానీ అరెస్టుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. నాలుగురోజుల క్రితం ఇదే కేసులో విచారణకు వచ్చిన ఎంపీ తండ్రి భాస్కరరెడ్డి కూడా అరెస్టుకు సిద్ధపడే విచారణకు వచ్చినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
This post was last modified on March 17, 2023 11:44 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…