Political News

అనురాధ విజయం ఖాయమా ?

వైసీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని చోట్ల గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారు. పార్టీ నేతలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ప్రత్యర్థులు ఊరుకుంటారా. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా.. అభ్యర్థిని రంగంలోకి దించారు. ఇప్పుడు అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంతకీ ఏమిటా ఎన్నికలు అనే కదా అనుమానం. అవే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఒక సీటు గెలిచే అవకాశం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు పాచిక వేసేశారు. పంచుమర్తి అనురాధను రంగంలోకి దించారు..

రెబెల్స్ ఎటు ?

ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరుగుతుంది. ఏడు స్థానాలకూ వైసీపీ అభ్యర్థులు రంగంలోకి దిగడంతో, టీడీపీ కూడా ఒక అభ్యర్థిని పోటీ చేయిస్తోంది. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకే ఓటేస్తారని టీడీపీ విశ్వాసం. పైగా తమకు కొందరు రహస్య స్నేహితులు కూడా ఉన్నారని టీడీపీ చెప్పుకుంటోంది. వైసీపీ కూడా పార్టీ మారిన వారిపైనే ఆశలతోనే అన్ని చోట్ల అభ్యర్థులను నిలిపింది.

ఫిరాయింపుదారులే కీలకం

అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీ మొత్తం ఏడు స్థానాల్లో గెలవలంటే తలా 25 ఓట్లు రావాలి. లేనిపక్షంలో ప్రాధాన్య ఓటు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలుండటంతో పార్టీ అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి 21 ఓట్లు లభిస్తాయి. మరో నలుగురు అభ్యర్థులకు మరో ఓటు అదనంగా వేయించవచ్చు. అంటే నలుగురికి 22 ఓట్లు, ముగ్గురుకు ఇరవై ఒక్క ఓట్లు పార్టీ పంచుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే… వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కన్నా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు లెక్క. కానీ ఆ పార్టీకి ఉన్న సమస్య నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించడం. టీడీపీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ వైసీపీలో చేరిపోయారు. అలాగే జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకే మద్దతుగా నిలిచారు. అంటే అనధికారికంగా టీడీపీకి 19 ఓట్లే వస్తాయనుకోవాలి.

విప్ తోనే ఇబ్బందులు

ఎన్నికల్లో ఫలానా అభ్యర్థికి ఓటెయ్యాలని పార్టీలు విప్ జారీ చేసే అవకాశం ఉంది. అలా విప్ జారీ చేసిన పక్షంలో ప్రత్యర్థులకు ఓటేస్తే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను కోరే అవకాశం కూడా ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే అనర్హత వేటు అన్నది ఒక సుదీర్ఘ ప్రక్రియ. స్పీకర్ నిదానంగా స్పందించిన పక్షంలో చేయగలిగిందేమీ లేకపోవచ్చు. దానితో ఈ లోపు ఎన్నికలే వచ్చేస్తాయి. అనర్హత వేటు వేస్తే ఎంత వేయకపోతే ఎంత..

చంద్రబాబు చాణక్యం !

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగానే అనురాధను రంగంలోకి దించారని భావిస్తున్నారు. ఆమె ఓడిపోతే బీసీ మహిళను జగన్ ఓడించారని ప్రచారం చేసే వీలుంటుంది. అయితే వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని అందరికీ తెలుసు. అందులో కొందరైనా క్రాస్ ఓటింగ్ చేస్తే అనురాధ గెలుపు ఖాయమవుతుంది. ఆమె విజయం సాధిస్తే భవిష్యత్తులో మైండ్ గేమ్ ఆడేందుకు ఈ ఫలితం ఉపయోగపడుతుంది.

This post was last modified on March 16, 2023 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

10 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

12 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

13 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

14 hours ago