ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తనను అరెస్టు చేయకుండా చూడాలని.. ఆయన హైకోర్టుకు వెళ్లినప్పటి నుంచి అవినాష్ విషయం మరింత చర్చకు దారితీసింది. అసలు ఏమీ లేనప్పుడు.. తాను ఏ పాపం ఎరుగనప్పుడు.. అరెస్టు చేయొద్దని ఆయన కోరుతున్నారంటే.. అనుమానించాల్సిందేనని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన సాక్ష్యాలు.. ఇతరత్రా అనేక ఆధారాల విషయం బయటకు వచ్చింది. దీనిపై స్పందిస్తున్న న్యాయ నిపుణులు.. ఇన్ని ఆధారాలు పెట్టుకునే సీబీఐ ఇంతగా అవినాష్ ను టార్గెట్ చేస్తోందని.. సీబీఐ ఏం చేసినా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించే స్తుందని చెబుతున్నారు. కాబట్టి.. అవినాష్ ఇప్పుడు తప్పించుకున్నా.. భవిష్యత్తులో మాత్రం తప్పించుకోవడం సాధ్యం కాదని.. తెలంగాణకు చెందిన న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇక, సీబీఐ కోర్టుకు సమర్పించిన సాక్ష్యాల్లో.. కీలకమైనవి నిపుణులు భావిస్తున్నవి చూస్తే.. హత్యకేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయి నివేదిక కీలకంగా మారింది. అదేవిధంగా, హార్డ్ డిస్క్, 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు.. వివేకా డెత్ నోట్, ఫోరెన్సిక్ నివేదిక, ఘటనా స్థలంలో ఆధారాలు చెరపకముందు తీసిన ఫొటోలు, కేసు డైరీ వివరాలను సీల్డ్ కవర్‌లో అందజేసింది. ఇవి కూడా ముఖ్యమైనవేనని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు.. ఈ ఆధారాలను బట్టే.. హత్యా స్థలిలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తరఫు న్యాయవాదులు అనిల్‌కుమార్, నాగేంద్రన్ హైకోర్టుకు నివేదించిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. తాత్కాలికంగా అరెస్టు నుంచి కొంత ఊరట లభించినప్పటికీ.. అవినాష్ మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోలేరని నిపుణులు తెగేసి చెబుతుండడం గమనార్హం.
This post was last modified on March 14, 2023 2:32 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…