గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చే నిజమైంది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే బీజేపీలోకి చేరతారంటూ.. పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన బీజేపీలోకి చేరతారో.. లేదో.. లైన్ క్లియరైందో లేదో.. అనే సందేహాలు మాత్రం వెంటాడాయి. తాజాగా దీనికి కూడా ఒక స్పష్టత వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. తాజాగా నల్లారి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పంపించారు. కేవలం ఒకే ఒక వాక్యం పేర్కొన్నారు. “కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను దయచేసి ఆమోదించగలరు” అని మాత్రమే ఆయన రాశారు. ఇక, ఇతర కారణాలేవీ కూడా పేర్కొనలేదు. దీంతో ఆయన రాజీనామా ఖరారైనట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. బీజేపీలో నల్లారికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి గతంలోనూ ఇలాంటి చర్చే జరిగినా.. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌చేపట్టిన జోడో యాత్రకు కూడా నల్లారి దూరంగా ఉండడంతో ప్రస్తుత చర్చపై ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి రెడీ అయిపోయారని తాజా రాజీనామా స్పష్టం చేస్తోంది. అయితే.. ఆయనను తెలంగాణలో ని పార్టీలోకి తీసుకుంటారా? లేక.. కేంద్రంలో బాధ్యతలు అప్పగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించిన ఆయన.. విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. అయితే ఎవరూ గెలవలేదు. దీంతో సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఏపీసీసీ సమన్వయకమిటీ సభ్యునిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం గమనార్హం.
This post was last modified on March 12, 2023 10:27 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…