ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.అంతలోనే మరో ఆసక్తికర సంఘటన జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో భేటీ అయ్యారు. గంటకు పైగా ఏకాంతంగా సమావేశమం కావడం వెనుక కూడా పెద్ద కథే ఉందని అంటున్నారు.
మోహన్ బాబు, వీర్రాజు భేటీపై బీజేపీ వర్గాలు ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తెరపైకి తెచ్చాయి. ఏపీలో మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరేందుకే వీర్రాజు వెళ్లి మోహన్ బాబును కలిశారట. బీజేపీకి మద్దతుగా స్టేట్ మెంట్ కూడా ఇవ్వాలని అభ్యర్థించారట.
అసలు కథ వేరే ఉందని బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కిరణ్ కుమార్ రెడ్డి రాకతో మొదలయ్యే ఒరవడిని కొనసాగించాలంటే మరికొంతమంది పేరున్న వారిని చేర్చుకోవాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే మోహన్ బాబుతో వీర్రాజు సమావేశమై ఉంటారని భావిస్తున్నారు. పైగా వీర్రాజుకు సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డితో అధిష్టానమే చర్చలు జరపడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు నొచ్చుకున్నారు. కొందరిని చేర్చినట్లు తన ఖాతాలో కూడా వేసుకోవాలన్న తపనతో ఆయన మోహన్ బాబును కలిశారని కూడా అంటున్నారు..
మోహన్ బాబు తీరును మాత్రం నమ్మలేమని కొందరి వాదన. ఎందుకంటే ఆయన కుటుంబం నిలకడగా ఏ పార్టీలో ఉన్నదీ లేదు. ఒక సారి కుటుంబ సమేతంగా ఢిల్లీలో ప్రధాని మోదీ ఆతిథ్యం స్వీకరించిన మోహన్ బాబు అప్పుడు కూడా బీజేపీలో చేరేందుకు ముందుకు రాలేదు. తొలుత టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన మోహన్ బాబు గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఒకటి రెండు సార్లు జగన్, మంచు విష్ణుని పిలిచి కూడా మాట్లాడారు.
నిజానికి చాలా మంది సినీ జనానికి పదవులు ఇచ్చిన జగన్ ఎందుకో మోహన్ బాబు కుటుంబాన్ని మాత్రం అకామటేడ్ చేయలేదు. దానితో టీడీపీ వైపుకు మొగ్గుచూపేందుకు మోహన్ బాబు ప్రయత్నించారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఎక్కడుండాలో మోహన్ బాబు నిర్ణయించుకోలేకపోవడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీతో కూడా అదే పరిస్థితి ఎదురుకావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 12, 2023 10:19 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…