నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంతో విభేదించి దూరం జరిగినప్పటి నుంచి రెబెల్ స్టార్ గానే కొనసాగుతున్నారు. పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తూ తూర్పార పడుతున్నారు. నెల్లూరుతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గం ఇంఛార్జ్ పదవి నుంచి తొలగించినప్పటికీ ఆయన వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదు. కిందపడినా పైచేయి తనదేనన్నట్లు మాట్లాడుతున్నారు..
నటనపై..
అధిష్టానం వర్సెస్ కోటంరెడ్డి పొలిటికల్ గేమ్ ఒక వైపు సాగుతుండగానే, నెల్లూరు సిటీ వర్సెస్ రూరల్ అంటూ సమాంతరంగా మరో ఆట నడుస్తోంది. పార్టీకి కోటంరెడ్డి దూరమైనప్పటి నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలకు డబ్బులిచ్చి టీడీపీ వైపుకు వెళ్లాలనుకుంటున్నారని ఆరోపించారు. కోటంరెడ్డి రాజకీయ నాయకుడి కంటే నటుడిగా ఎక్కువ సత్తా చూపించగలరని అనిల్ ఆ మధ్య ఆరోపించారు. ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు, మహానటి సావిత్రి ఆయన ముందు ఎందుకు పనికిరారని అనిల్ అప్పట్లో సెటైర్లు వేశారు. పౌరుషం ఉన్నవాడైతే కోటంరెడ్డి రాజీనామా చేయాలని అనిల్ సవాలు విసిరారు..
ఎదురుదాడి..
కోటంరెడ్డి కూడా అప్పుడే ఎదురుదాడి చేశారు. అనిల్ ను నమ్మకద్రోహిగా సంబోధించారు. గతంలో ఆయన ఆనం వివేకానందరెడ్డికి ద్రోహం చేశారని చెప్పుకొచ్చారు. 2009లో తనకు టికెట్ ఇప్పించిన వివేకా ఇంటి మీద దాడికే వెళ్లారని గుర్తుచేశారు. అనిల్ కు మంత్రి పదవి ఇచ్చినప్పుడు నెల్లూరులో తాను ర్యాలీలు ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు తన మీదే ఆయన ఆరోపణలు సంధిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు..
అనిల్ ఇలాకాలో…
అనిల్ దూకుడును కౌంటర్ చేసేందుకు కోటంరెడ్డి కొత్త గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అనిల్ నియోజకవర్గమైన నెల్లూరు సిటీలోకి వెళ్లిపోయి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవాల నుంచి అన్నదానాల వరకు అనేక పనులు జరిపిస్తున్నారు. తానే దగ్గరుండి చేయడంతో పాటు ఫోటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ అనిల్ ను టెన్షన్ పెడుతున్నారు. కార్యక్రమ నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యే అనిల్ ను పిలవకుండా పక్క నియోజకవర్గం ప్రతినిధి కోటంరెడ్డిని ఆహ్వానించడం జిల్లాలోనే చర్చనీయాంశమవుతోంది. నెల్లూరు సిటీలో కార్యక్రమాలకు తనను పిలవాలని కోటంరెడ్డి లాబీయింగ్ చేస్తున్నారు. అందుకోసం డబ్బుల పంపిణీ కూడా చేస్తున్నారని స్థానిక నేతలు చెబుతున్నారు. సిటీలో తన కేడర్ ను బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో అవసరమైతే రూరల్ ని వదిలేసి సిటీ నుంచి పోటీ చేసే వీలుంటుందని కోటంరెడ్డి భావిస్తున్నారట. అదీ సంగతి…
This post was last modified on March 10, 2023 7:09 pm
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి…
బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పేయబుల్ హీరోల్లో ఒకడిగా మారిన సిద్దు జొన్నలగడ్డకు సినిమాల పరంగా మధ్యలో బాగానే గ్యాప్ వస్తోంది.…
వైసీపీ అధినేత జగన్ పాలనా కాలంలో తీసుకువచ్చిన నాడు-నేడు అనే మాట ఇప్పుడు కూటమి సర్కారు చక్కగా వినియోగించుకుంటోందా? ఈ…