Political News

మోడీ ఎఫెక్ట్: ఉచితాల వైపు వడివడిగా అడుగులు!

వచ్చే రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ప్రధాని మోడీ భయం పట్టుకుందా? ముఖ్యంగా ఆయన వ్యూహం, దూకుడుపై అంచనాలు వేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఉచిత పథకాలను మరిన్ని ప్రకటించడంతో పాటు, ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేస్తూ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ మే మధ్య తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోంలలో ఎన్నికలు జరగనున్నాయి.

అయితే వీటిలో బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న, అధికారంలోకి రావాలనే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాలు రెండు ఉన్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్ ముందువరుసలో ఉంది. తర్వాత తమిళనాడు, కేరళ ఉన్నాయి. ఇక అసోంలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఈ నేపథ్యంలో అతి పెద్ద రాష్ట్రాలపై బీజేపీ సహా ప్రధాని మోడీ చాలానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. గతంలో లేని విధంగా వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు.

ఈ క్రమానికి తోడు ‘సర్’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం తొలగిస్తున్న లక్షలాది ఓట్లు కూడా స్థానిక ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలను తీవ్ర స్థాయిలో కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పోరు సాగించే క్రమంలో ఎక్కడ చిన్న తేడా కొట్టినా మొత్తం పరిస్థితికే ఇబ్బందులు తప్పవని గ్రహిస్తున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే అమలు చేసే ఉచిత పథకాలను ఇప్పుడే ప్రారంభించేస్తున్నారు. ఇది కొంత విచిత్రంగా ఉన్నా ప్రజలను తమవైపు నిలబెట్టుకునేందుకు ఇంతకన్నా మార్గం ఆయా పార్టీలకు కనిపించడం లేదు.

గత నెలలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మహిళల ఖాతాల్లో 5000 రూపాయల చొప్పున జమ చేసింది. వాస్తవానికి ఇది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇస్తామని చెప్పిన మాట. కానీ ముందుగానే వేసేసి మహిళలను తమవైపు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏకంగా యువతను టార్గెట్ చేసుకుని కీలక పథకాన్ని ప్రకటించడంతో పాటు దానిని అమల్లో కూడా పెట్టేశారు. అదే ‘నిరుద్యోగ భృతి’. తాము మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు 1500 చొప్పున ఇస్తామని ప్రకటించిన మమతా బెనర్జీ దానిని తాజాగా అమలు కూడా చేసేశారు.

యువసాథి

‘యువ సాథి’ (యువతకు చేరువగా) పేరుతో ప్రారంభించిన ఈ పథకం కింద 21 ఏళ్లు నిండిన యువతకు నెలకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. 40 ఏళ్ల వయస్సు ఉన్న వారి వరకు దీనిని అమలు చేస్తారు. వాస్తవానికి ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కానీ పైకి ఎన్ని చెప్పినా బీజేపీ వ్యూహాలు, ప్రధాని మోడీ దూకుడుతో మమతా బెనర్జీ తక్షణమే నిధులు మంజూరు చేసి యువత ఖాతాల్లో సొమ్ములు వేయడం గమనార్హం. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇలాంటి చిత్రాలు ఇంకా ఎన్నో చూడాల్సి ఉంటుందోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on March 7, 2026 10:36 pm

Share

Recent Posts

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

15 minutes ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

31 minutes ago

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

2 hours ago

స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు

గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…

6 hours ago

మోడీ ప‌ర్య‌ట‌న‌… బ్లాక్ డ్రెస్‌లో సీఎం విజ‌య్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదివారం త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. అయితే..…

11 hours ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

11 hours ago