పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు గత కొన్నేళ్లలో చెప్పిన డేట్ కన్నా వారం ముందు వస్తున్న స్టార్ హీరో సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద అభిమానులకు బోలెడు అంచనాలున్నాయి. హరీష్ శంకర్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో మరోసారి మేజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో మార్చి 19 కోసం ఎదురు చూస్తున్నారు.
ట్రైలర్ కు ముందు చిన్న శాంపిల్ రూపంలో 45 సెకండ్ల వీడియోని విడుదల చేశారు. ఇందులో పవన్ స్వాగ్, స్టయిల్ పరిచయం చేస్తూ అసలు కంటెంట్ ఎలా ఉండబోతోందో కొన్ని క్లూస్ ఇచ్చారు. కౌబాయ్ గెటప్ టైపులో ఉన్న కాస్ట్యూమ్ తో ఆయుధం పట్టుకుని భగత్ సింగ్ పోలీస్ స్టేషన్ లోకి రావడం, ఇది భగవత్గీత కాదు భగత్ గీత దమ్ముంటే దాటండి అంటూ వార్నింగ్ ఇవ్వడం పూర్తిగా ఫ్యాన్ స్టఫ్ లా ఉంది.
పంచెకట్టు వేసుకుని రౌడీలతో తలపడే షాట్, గుర్రం మీద సన్నివేశం బోనస్ గా పొందుపరిచారు. ఇది కేవలం ట్రైలర్ కు టీజర్ కాబట్టి ఇంతకన్నా దీన్ని డీ కోడ్ చేయలేము కానీ మొత్తానికి హరీష్ శంకర్ చెప్పినట్టు ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా మాస్ మెటీరియల్ తో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే సరుకుతో ఉగాది పండక్కు వస్తోంది. ఓజి తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ ఇదే కావడంతో హైప్ పరంగా రిలీజ్ నాటికి ఆకాశమే హద్దుగా ఉంటుందని బయ్యర్ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఓజి గ్యాంగ్ స్టర్ డ్రామా కాబట్టి మాస్ వర్గాలకు పూర్తి స్థాయిలో చేరలేదు. అయినా మూడు వందల కోట్లు కొల్లగొట్టింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాపర్ మాస్ మసాలాలున్న మూవీ. సో టార్గెట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ కి ఇవ్వడంతో ఆ ముద్ర అయితే కనిపిస్తోంది. దురంధర్ ది రివెంజ్ రూపంలో భారీ పోటీని ఎదురుకోబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ దానికి ధీటుగా ఉంటుందా అనేది ఫుల్ ట్రైలర్ వచ్చాక క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 7, 2026 8:30 pm
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…