Political News

వైసీపీ డాక్ట‌ర్ మంత్రికి చుక్క‌లే.. నియోజ‌క‌వ‌ర్గం టాక్ !

వైసీపీ మంత్రి, ఉన్న‌త విద్యావంతుడు.. డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు. శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క వ‌ర్గం నుంచి గత ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి తొలిసారి విజ‌యం ద‌క్కిం చుకున్న నాయ‌కులకు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెర‌గాలి. గ‌తంలో ఇలానే జ‌రిగేది. తొలిసారి విజ‌యం ద‌క్కించు కున్న వారికి ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు ల‌భించేది. అయితే.. దీనికి భిన్నంగా సీదిరి వ్య‌వ‌హారం ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న మంత్రిగా ఉన్నారు. అంతేకాదు.. త‌ర‌చుగా ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శలు కూడా చేస్తున్నారు.

అయితే, వాస్త‌వానికి ఉన్న‌త విద్య చ‌దువుతున్న సీదిరి ఉన్న‌తంగా రాజ‌కీయాలు చేస్తార‌ని..ఇక్క‌డి ప్ర‌జలు ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్టారు. అయితే.. దీనికి భిన్నంగా ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు. ఒక సామాజిక వ‌ర్గానికి వ్య‌తిరేకంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆ వ‌ర్గం వైసీపీకి దూర‌మైంది. అదేస‌మ‌యంలో మ‌హిళ అని కూడా చూడ‌కుండా.. టీడీపీ నాయ‌కురాలు గౌతు శిరీష్ పై ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉన్నాయి. దీంతో వ్య‌క్తిగ‌తంగా సీదిరి చాలానే న‌ష్ట‌పోతున్నార‌ని అంటున్నారు.

తాజాగా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో చేయించిన స‌ర్వేలో సీదిరి విష‌యంలో ప్ర‌జ‌లు ఎలా ఆలోచిస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలిసిపోయింది. క‌నీసం.. ఆయ‌న‌ను ప‌ట్టించుకునేందుకు కూడా ప్ర‌జలు సిద్ధంగా లేరు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు 45 శాతం ఓటు బ్యాంకు వ‌స్తే.. ఇప్పుడు అది 28 శాతానికి ప‌డిపోయింది. అదేస‌మ‌యంలో టీడీపీ ఒంట‌రిగా పోటీ చేసినా.. 38 శాతం నుంచి 44 శాతం వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందని తేలిపోయింది.

ఈ ప‌రిణామంతో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వైసీపీ ఓడిపోయే తొలి సీటు ఇదేనా? అనే చ‌ర్చ సొంత పార్టీలోనే జ‌రుగుతుండ‌డం ఆస‌క్తిగా మారింది. పైగా.. వైసీపీ నేత‌ల్లోనూ సీదిరి అంటే దూరం పెడుతున్న ప‌రిస్థితి వ‌చ్చింది. ఇటీవ‌ల కొన్నాళ్ల కింద‌ట‌.. సీదిరి వ్య‌తిరేకంగా.. వ‌న భోజ‌నాలు పెట్టిన ఒక వ‌ర్గం.. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వొద్ద‌ని.. తీర్మానం చేస్తూ..పార్టీ అధిష్టానానికి లేఖ పంపింది. అయితే..దీనిని అధిష్టానం లైట్ తీసుకుంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆ వ్య‌తిరేక‌త అలానే కంటిన్యూఅవుతోంది. దీంతో వైసీపీ కి ఇబ్బంది త‌ప్ప‌ద‌ని అంటున్నారు పరిశీల‌కులు.

This post was last modified on %s = human-readable time difference 9:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిది సినిమాల జాతర ఉంది కానీ

నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…

28 mins ago

ఆ కారు ప్రమాదంపై స్పందించిన విజయమ్మ

2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…

51 mins ago

పవన్ వ్యాఖ్యలపై అనిత ఫస్ట్ రియాక్షన్

ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…

54 mins ago

ముగ్గురు హీరోలు కలిస్తే రచ్చే

కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…

60 mins ago

పవన్ వ్యాఖ్యలపై ఫస్ట్ రియాక్షన్ ఆ మంత్రిదే

పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…

1 hour ago

హనుమంతుడు రిషబ్ అయితే రానా ఎవరు

2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…

4 hours ago