వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు నిలుస్తారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగాలని నిర్నయించుకున్న వైసీపీ అధినేత పార్టీ ఎమ్మెల్యేల తీరును చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సర్వేలు.. రిపోర్టులతో నిత్యం ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. పాజిటివ్ పరిస్థితి కనిపించడం లేదు.
ఇదే విషయం వైసీపీలో చర్చకు వస్తోంది. తాజాగా రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేపై వ్యతిరేక రిపోర్టు వచ్చినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కర్నూలు, మెజారిటీ సీట్లు దక్కించుకున్న అనంతపురం జిల్లాల్లో ఈ సారి వైసీపీ బొక్క బోర్లా పడడం ఖాయమని సదరు నివేదికలో ఉన్నట్టు వైసీపీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఈ సారి వైసీపీ అంత ఈజీకాదని కూడా తేలిపోయిందని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో అయితే.. వైసీపీ వ్యతిరేకత చాపకింద నీరుగా ఉందని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మంత్రులు.. తీవ్ర అవినీతి ఊబిలో చిక్కుకున్నారని అంటున్నారు. ఇది కూడా నిజమేనని అనిపిస్తోంది. మంత్రి.. ఉష శ్రీచరణ్‌పై భూముల ఆక్రమణ బాగోతం కొన్నాళ్లు ఊపేసింది. దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక, కర్నూలులో మంత్రి గుమ్మనూరు జయరాం..వ్యవహారం కూడా ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చకు వస్తోంది.
దీనికితోడు ఉమ్మడి అనంతలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ఇప్పటికీ చల్లారలేదు. అంతర్గత చర్చల్లో ఆయనను వైసీపీ నాయకులే.. న్యూడ్ ఎంపీ అని పిలుచుకునే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇక, ఇదే జిల్లాలో అంతర్గత కలహాలు.. పోలీసులను అడ్డుపెట్టుకుని సొంత పార్టీనేతలపైనే కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 1, 2023 10:19 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…