జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా.. కలిసిపోటీ చేస్తాయని బీజేపీ నాయకులు ఏపీలో ఊదరగొడుతున్నారు. అదేసమయంలో టీడీపీ.. వైసీపీపై కుటుంబ పార్టీ అనే ముద్ర వేశారు. వాటితో తాము కలిసేది లేదని అంటున్నారు. అయితే.. ఇలా చెబుతున్నప్పటికీ.. జనసేన విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు.. వివాదాలకు దారితీస్తోందని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా బీజేపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఈ పొత్తు పై చాలా ఆసక్తిక వ్యాఖ్యలే చేశారు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు.. ఒకరకంగాను.. బయట మరోవిధంగా ను ఈ పొత్తులపై మాట్లా డుతున్నారని కన్నా వ్యాఖ్యానించారు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు.. జనసేనతో పొత్తు గురించి వ్యం గ్యాస్త్రాలు విసురుతున్నారని.. ఆపార్టీతో సంబంధం లేకుండా.. ఒంటరిగా ఎదుగాలని ఆదేశాలు ఇస్తున్నా రని చెప్పుకొచ్చారు.
అదే బయటకు వచ్చాక.. జనసేనతో కలిసి ముందుకు వెళ్తామని అంటున్నారని..ఇదంతా బీజేపీ వ్యూహమ ని కన్నా చెప్పుకొచ్చారు. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ వ్యాఖ్యలను బలపరుస్తున్నాయి. అంతర్వే దిలో రథం తగలబడిన వ్యవహారంపై హిందూ ఓట్లను ఆకర్షించాలని భావించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు వెంటనే ఒంటరిగానే బరిలో దిగి.. ఉద్యమించారు. అయితే… ఇది అనుకున్న విధంగా మాత్రం సక్సెస్ కాలేదు.
అదేసమయంలో ఎస్సీ వర్గంపై దాడులు జరుగుతున్న క్రమంలో జనసేన ఉద్యమాలకు దిగినప్పుడు మాత్రం.. తమకు చెప్పకుండా.. చేయడం ఏంటని అదే సోము ప్రశ్నించారు. ఇక, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో జనసేన టికెట్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసికూడా.. సోము మాత్రం తామే పోటీ చేస్తామని ప్రకటించేశారు. కడప జిల్లా బద్వేల్‌కు జరిగిన ఉప ఎన్నికలోనూ ఇలానే వ్యవహరించారు. ఇక్కడ పోటీ వద్దన్న పవన్ వ్యాఖ్యలను సోము పట్టించుకోలేదు. ఇలా.. ఎటు చూసినా.. కన్నా చెప్పినట్టు.. జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 24, 2023 1:56 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…