గూగుల్.. నిత్యం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నెటిజన్లు వినియోగించే విషయం తెలిసిందే. అనేక సందేహాలకు.. సమాధానాలు చెప్పడమే కాదు.. నిత్యం అనేక మందికి జీవనాధారంగాకూడా గూగుల్ మారిపోయింది. అయితే.. ఇప్పుడు ఇదే గూగుల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైసీపీ అధినేత, సీఎంజగన్ బాబాయి.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు కూడా ఉపయోగపడింది.
తాజాగా ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. కోర్టులో ఒక నివేదిక దాఖలు చేశారు. దీనిలో వారు.. పక్కా ఆధారాలు ఉన్నాయని.. హత్య జరిగిన సమయంలో ఎంపీఅవినాష్ ఎక్కడున్నారు.. ఆయన కు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? ఎలా వెళ్లింది..? వంటి కీలక విషయాలను పూసగుచ్చినట్టు వివరించారు. అంతేకాదు.. ఈ సమాచారం సీఎం జగన్‌కు కూడా ముందుగానే తెలుసునని పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ అధికారులు పేర్కొన్న కీలక ఆధారం.. గూగుల్ టేక్ అవుట్
గూగుల్ టేక్ అవుట్ ద్వారానే తాము ఆధారాలు సేకరించామని.. సీబీఐ తన నివేదికలో కోర్టుకు వెల్లడిం చింది.దీంతో అసలు గూగుల్ టేక్ అవుట్ అంటే ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు గూగుల్ ట్రాన్స్‌లేషన్.. గూగుల్ జీమెయిల్.. ఇతరత్రాయాప్‌లే వినియోగించిన వారికి అసలు గూగుల్ టేక్ అవుట్ అంటే.. తెలియకపోవడం విశేషం. దీంతో ఎక్కువ మంది గత రెండు రోజులుగా తెగ వెతికేసింది కూడా గూగుల్ టేకవుట్ అంటే ఏంటి? అనే!!
మరి.. గూగుల్ టేక్ అవుట్ అంటే ఏంటో చూద్దాం..
గూగుల్ టేక్ అవుట్ అఏది.. డేటా లిబరేషన్ ఫ్రంట్ ప్రాజెక్ట్, ఇది యూట్యూబ్, జీమెయిల్ వంటి వినియోగదారుల వివరాలను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసి.. ఆర్కైవ్(దాచడం) ఫైల్‌కి ఈ డేటాను పంపేస్తుంది. సాధారణంగా.. దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇది ఫోన్లలో ఒక్కొక్కసారి వినియోగదారు అనుమతి లేకుండానే డేటాను తీసుకుని.. గూగుల్ టేక్ అవుట్‌లో నిక్షిప్తం చేస్తుంది.
అందుకే .. దీని గురించి తెలిసిన వారు గూగుల్ టేక్ అవుట్‌లోకి వెళ్లి సమాచారాన్ని డిలీట్ చేస్తుంటారు. తెలియనివారు.. మాత్రం అలానే ఉంచేస్తారు. ఇక, దీని వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. మనం మరిచిపోయిన ఫోన్ నెంబర్లు.. సమాచారం.. అంతా కూడా..ఎప్పుడు కావాలంటే.. అప్పుడు మనకు ఈ గూగుల్ టేక్ అవుట్(పేరులోనే తీసుకువెళ్లు అని ఉంది కదా!) అందిస్తుంది.
గూగుల్ టేక్ అవుట్‌లో అన్ని ఫైల్స్‌ను జిప్ ఫైల్‌లో ఉంచుతుంది. ఈ జిప్ ఫైల్స్ కూడా దేనికదే ప్రత్యేకంగా ఒకఫోల్డర్‌లో ఉంటాయి. ఇక, ఈ గూగుల్ టేక్అవుట్ జూన్ 28, 2011 నుంచి అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తమ డేటాను చాలా వరకు గూగుల్ నుంచే సేకరిస్తారు. ఈ క్రమంలో సదరు డేటాను నిక్షిప్తం చేసుకునేందుకు గూగుల్ ఈ టేక్ అవుట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
గూగుల్ టేక్ అవుట్‌లో ఒక్క ఫోన్ నెంబర్లే కాదు.. మాట్లాడిన వాయిస్ రికార్డులు.. ఫొటోలు.. వీడియోలు, ఇతర సమాచారం అన్నీ నిక్షిప్తం అయిపోతాయి. ఇలా.. నిక్షిప్తం అయిన.. డేటా నుంచే వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన డేటాను సీబీఐ అధికారులు గుర్తించారు. అవినాష్ హత్య సమయంలో ఇంట్లోనే ఉన్నాడని.. తెల్లవారి ఏమీ తెలియనట్టు వచ్చాడని.. కూడా పేర్కొన్నారు. మొత్తంగా గూగుల్‌టేక్ అవుట్ విషయం.. కొందరికే తెలిసినా. ఇప్పుడు మాత్రం చాలా ఆసక్తి ఏర్పడడం గమనార్హం.
This post was last modified on February 24, 2023 1:51 pm
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…