Political News

నోటి దూల – సీరియస్ చిక్కుల్లో పడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించింది. దిల్లీలోని జాతీయ కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని.. ఫిబ్రవరి 21న వచ్చి స్వయంగా వివరణ ఇవ్వాలని చెప్పింది. విచారణకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.

తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనవరి 25న ఆయన జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నరును ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. దీనిపై అప్పుడే తీవ్ర విమర్శలొచ్చాయి. బీజేపీ నేతలు కొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

అయితే, మహిళా కమిషన్‌కు దీనిపై ఫిర్యాదు అందనప్పటికీ.. గవర్నరు వంటి రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న మహిళపైనే పరుష వ్యాఖ్యలు చేసిన ఘటనను సుమోటోగా విచారణకు తీసుకుంది.

కాగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సందర్భంలోనూ ఆ ఫైల్ చాలాకాలంపాటు గవర్నరు వద్ద పెండింగులో ఉంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడంతో అనివార్యమైన ఉప ఎన్నికలో .. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటపై గెల్లు శ్రీనివాసయాదవ్‌ను పోటీకి నిలిపింది బీఆర్ఎస్. దీంతో అక్కడి ప్రధాన నాయకుడైన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. గవర్నరు కోటాలో నామినేట్ చేయగా గవర్నరు ఆ ఫైల్‌ను చాలాకాలం ఆపేశారు.

ఆ నేపథ్యంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నరుకు మధ్య ఉన్న ఘర్షణ కారణంగానూ కౌశిక్ రెడ్డి గవర్నరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. జాతీయ మహిళా కమిషన్ విచారణకు హాజరు కానట్లయితే ఆయనపై చర్యలు ఉండొచ్చు.

This post was last modified on February 20, 2023 9:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

1 hour ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

7 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

10 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

12 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

13 hours ago