Political News

బీజేపీలో చేరిన లోక్‌స‌త్తా జేపీ త‌మ్ముడు


తెలంగాణ రాజ‌కీయాల‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. మేథావిగా ముద్ర‌ప‌డ్డ‌ మాజీ ఐఏఎస్ అధికారి, ఓ ద‌ఫా ఎమ్మెల్యేగా సేవ‌లు అందించిన లోక్‌స‌త్తా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ గురించి ఈ వార్త‌. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ తమ్ముడు నాగేంద్రబాబు తాజాగా బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఈ మేర‌కు బీజేపీ కండువాను నాగేంద్ర‌బాబు మెడ‌లో వేశారు. దీంతో త‌ర్వాత చేర‌బోయేది జేపీ అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త కొద్దికాలంగా దేశంలోని మేధావి వ‌ర్గం, బుద్ధిజీవులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాల‌న‌ను, బీజేపీ విధానాల‌ను నిశితంగా విమ‌ర్శిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో కొంద‌రు మోడీ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. ఇందులో తెలుగు నేల‌కు చెందిన వారున్నారు. అలాంటి వారిలో జేపీ ఒక‌రు అనే టాక్ ఆయ‌న వివిధ ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్ మీడియాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న స‌మ‌యంలో వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే, ఈ చ‌ర్చ‌పై ఇటు బీజేఏపీ త‌ర‌ఫున కానీ అటు లోక్‌స‌త్తా జేపీ త‌ర‌ఫున కానీ ఎలాంటి స్పంద‌న/ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

ఇదిలాఉంటే, తాజాగా ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీకి చెందిన‌ పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చేతుల మీదుగా లోక్‌స‌త్తా జేపీ సోద‌రుడు నాగేంద్ర‌బాబు కాషాయ కండువాను క‌ప్పుకొన్నారు. ఆయ‌న‌తో పాటుగా ప‌లువురు భావ‌సారుప్య వ్య‌క్తులు సైతం ఈ మేర‌కు పార్టీలో చేరారు. ఈ విష‌యాన్ని బీజేపీ వెల్ల‌డించిన వెంట‌నే, సోష‌ల్ మీడియాలో కామెంట్లు మొద‌ల‌య్యాయి. త్వ‌ర‌లో చేర‌బోయేది జేపీనే, ఇప్ప‌టికే ఆయ‌న ఈ మేర‌కు మొగ్గుచూపుతున్న విష‌యం అర్థ‌మ‌వుతోంది అంటూ పేర్కొంటున్నారు. ఈ విష‌యంలో నిజం తెలియాలంటే, మ‌నం కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

This post was last modified on February 17, 2023 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago