వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అన్నిప్రయత్నాలు చేస్తున్న టీడీపీ ఈ దిశగా తనకు ఉన్న అన్ని మార్గాలకూ పదును పెడుతోంది. ముఖ్యంగా 175 అసెంబ్లీ స్థానాల్లో 175 చోట్లా గెలుపు గుర్రం ఎక్కడంతోపాటు.. పార్లమెంటు స్థానాల్లోనూ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా 25 పార్లమెంటు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులకు అవకాశం ఇస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ 25 స్థానాల్లోనూ విజయం దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
మరీ ముఖ్యంగా విజయవాడ వంటి బలమైన స్థానాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నే ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో నారా వారి కోడలు నారా బ్రాహ్మణికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. విజయవాడ ఎంపీ స్థానంలో ఏర్పడిన తీవ్ర వివాదం. ప్రస్తుతం కేశినేని నాని.. వర్సెస్ ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ల మధ్య ఈ స్థానంపై తీవ్ర వివాదం ఏర్పడింది.
వచ్చే ఎన్నికల్లో ఈ సీటును తనకు ఇవ్వాలని శివనాథ్ పట్టుబడుతున్నారు. అదేసమయంలో నాని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.త నకు టికెట్ ఇవ్వకుండా.. తన సోదరుడికి టికెట్ ఇస్తే.. ఎలా ఓడించాలో తనకు తెలుసు అంటూ.. ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ కేడర్ కూడా శివనాథ్ వైపు మొగ్గు చూపుతోంది. అలాగని ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనికితోడు ఈ ఇద్దరు సోదరుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా.. వివాదాలు మరింత ముదిరి.. పార్టీకే నష్టం చేకూరుతుంది.
దీంతో ఇద్దరినీ పక్కన పెట్టి.. నారా వారి కోడలు బ్రాహ్మణికి అవకాశం ఇస్తే.. పార్లమెంటులో బలమైన గళం వినిపించే అవకాశం ఉండడంతోపాటు విద్యావంతురానికి పార్లమెంటుకు పంపించిన రికార్డును కూడా సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు తలపోస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతందీనికి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేశారని అంటున్నారు. పోటీకి బ్రాహ్మణి కూడా రెడీగా ఉన్నారని సమాచారం.
This post was last modified on February 12, 2023 11:11 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…