తనకు తనే సర్టిఫికెట్లు ఇచ్చుకునే నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంలో మాత్రం వారు విఫలమవుతున్నారు. ఇలాంటివారిలో మాజీ మంత్రి అఖిల ప్రియ ఒకరు. టీడీపీలో తను ఫైర్‌బ్రాండ్ అని ఆమె పదే పదే చెప్పుకొంటారు. కానీ, వాస్తవం ఏంటంటే.. 2014లో అమ్మ సింపతీతో విజయం దక్కించుకున్న ఆమె 2019లో చతికిల పడ్డారు. ఈ విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. పైకి మాత్రం చాలా గంభీరంగా.. నంద్యాల నాన్న.. ఆళ్లగడ్డ అమ్మ అని చెప్పుకొంటున్నారు.
ఇక, ఇటీవల కాలంలో అఖిల ప్రియ గ్రాఫ్ దారుణంగా పడిపోతున్న విషయం తెలిసిందే. ఆమె స్వయంగా చేసుకున్న కొన్ని చిక్కులకు ఆమె రాజకీయం బలి అయిపోతోంది. హైదరాబాద్లో చోటు చేసుకున్న రెండు విషయాల్లో కేసుల చిక్కుముళ్లు ఆమెను విడిచిపెట్టడం లేదు. ఒకటి స్థలం వివాదం, రెండు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడడం. వీటినుంచే ఆమె చిక్కులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు అప్పుల కుప్పలు.. ఇప్పుడు ఆమె సతమతం చేస్తున్నాయి.
ఇదిలావుంటే.. పార్టీపరంగా ఎవరైనా ఆమెకు దన్నుగా ఉన్నారా? అంటే ఎవరూ లేరు. ఎందుకంటే.. ఆమె రైవల్ ఏవీ సుబ్బారెడ్డివైపే అందరూ నిలుస్తున్నారు. ఈయన వియ్యం అందుకున్న బొండా ఉమా.. కొన్నాళ్లుగా ఆళ్లగడ్డలో చక్రం తిప్పుతున్నారు. వియ్యంకుడిని బలోపేతం చేస్తున్నారు. అంతేకాదు.. తన వియ్యంకుడు ఏవీ సుబ్బారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకునేందుకు బొండా ఉమా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి సఫలం కూడా అయ్యాయని తెలుస్తోంది.
చంద్రబాబు దగ్గర ఉన్న ఇమేజ్‌తో బొండా ఉమా.. ఆళ్లగడ్డలో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తానని.. సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరారని తెలిసింది. దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు ఓకే చెప్పారని అంటున్నారు. ఇప్పటికే నంద్యాల టికెట్‌ను శిల్పా రవికి ఇస్తున్నట్టు అఖిల ప్రియే వెల్లడించారు. ఇక, ఇప్పుడు ఆళ్లగడ్డ కూడా పోయింది. దీంతో “ఏతీరుగ నను దయచూసెదవో” అంటూ.. ఆమె చంద్రబాబు అప్పాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 11, 2023 12:52 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…