Political News

కోటంరెడ్డి వస్తే ఆనం రెడ్డి టీడీపీలోకి వెళ్లరా?

నెల్లూరు రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. అధికార వైసీపీలో అసమ్మతి ఏకంగా బయటపడిపోవడంతో రోజూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇంతకాలం తమ ప్రభుత్వం ఏ పనీ చేయడం లేదంటూ అసమ్మతి వ్యక్తంచేసిన నేతలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో జగన్‌ను ఇరకాటంలో పడేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమైతే అది కానీ అన్నట్లుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, స్థానిక వైసీపీ మంత్రి, మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లడం ఖాయమని అనుచరులే కాదు ఆయన కూడా ఓపెన్‌గా చెప్తున్నారు.

అయితే… కోటంరెడ్డి ఇష్యూ మొదలుకావడానికి ముందు వరకు ఆనం రామనారయణరెడ్డి ఫైర్ మీద ఉండేవారు. చాలాకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్న ఆనం కూడా తాజాగా ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఆనం అసంతృప్తి గళం పెంచడంతో ఇప్పటికే ఆయన నియోజకవర్గమైన వెంకటగిరి ఇంచార్జిగా మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడిని నియమించారు. దీంతో ఆనం కూడా వైసీపీని వీడి బయటకు రావడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది.

అయితే, ఆనం టీడీపీలోకి వెళ్తారని ఇంతవరకు ప్రచారం జరిగింది. ఆనం కుమార్తె కైవల్య రెడ్డి ఆత్మకూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారని… ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరిగింది. ఇద్దరి విషయంలోనూ చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు టీడీపీ నుంచి వచ్చాయి.

గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన ఆనం ఈసారి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని కోరుకున్నారు. 2009లో నెల్లూరు రూరల్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి అన్న వివేకానందరెడ్డి గెలిచారు. ఆ తరువాత 2014, 2019 నుంచి కోటంరెడ్డి గెలుస్తూ వస్తున్నారు.

అయితే… ఇప్పుడు కోటంరెడ్డి కూడా టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరగడంతో ఆనం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలోకి వచ్చిన తరువాత అక్కడ కోటంరెడ్డి నుంచి ఇబ్బందులు వస్తే ఎలా అనేది ఆనం ఆందోళనగా తెలుస్తోంది. వైసీపీలో ఇద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు. కోటంరెడ్డి దూకుడు మనిషి కాగా ఆనం సాఫ్ట్ పొలిటీషియన్. దీంతో టీడీపీలోకి వెళ్లిన తరువాత కూడా అక్కడ కోటంరెడ్డితో ఇష్యూస్ ఏర్పడితే ఎలా అనేది ఆనం ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఆనం బీజేపీలో చేరాలన్న ఆలోచనలోనూ ఉన్నట్లుగా చెప్తున్నారు. కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేయడం ఖరారైనా తాను టీడీపీలోకి వెళ్లాలా బీజేపీలోకి వెళ్లాలా అనేది ఆనం తేల్చుకోలేకపోతున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు.

This post was last modified on February 6, 2023 10:05 am

Share
Show comments

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

8 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

9 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

12 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

13 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

13 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

14 hours ago