కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయ్. తన ప్రతినిధులను వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ అక్కడి నాయకులను చేర్చుుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో పార్టీ టేకాఫ్ దిశగా నాందేడ్ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంతమంది వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వైజాగ్ వెళ్లి గంటా శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీ నారాయణను కలిశారు.
వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. రోజుకు రెండు పూటల జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించిన ఆయన ఇప్పుడు తనను ఎన్ కౌంటర్ చేస్తారేమోనని టెన్షన్ పడుతున్నారు.
ఏ పార్టీలోకి రానివ్వరా..
కోటంరెడ్డి టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు సమాచారం. కాకపోతే ఆయన్ను చేర్చుకునే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన ప్రవర్తన, టీడీపీ పట్ల ఆయన ప్రవర్తించిన దూకుడును చూసి చంద్రబాబు వెనుకాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోటంరెడ్డి పట్ల నెల్లూరు జిల్లా టీడీపీ కేడర్ కూడా విముఖంగా ఉందని చెబుతున్నారు..
ఎవరూ చేర్చుకోకపోతే బీఆర్ఎస్
వైసీపీని వీడే క్రమంలో తాను కొన్ని పార్టీల వైపు చూస్తున్నానని కోటంరెడ్డి ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ఎవరూ చేర్చుకోకపోతే కొత్త పార్టీ బీఆర్ఎస్ లో చేరతానని ఆయన అన్నారు. అంటే ఆప్షన్లు చాలానే ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పారు.
ఎదురుచూస్తున్న బీఆర్ఎస్
కోటంరెడ్డి లాంటి నాయకుల కోసం బీఆర్ఎస్ ఎదురుచూస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లాలో బలమైన సామాజికవర్గం నేత. పైగా ఎన్నికల్లో ఎంతైనా వ్యయం చేసేందుకు కోటంరెడ్డి వెనుకాడరు. పది మందిని తనతో తిప్పుకుంటూ పార్టీకి బలముందని కూడా నిరూపించగలరు. మరి కేసీఆర్, కోటంరెడ్డి మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి…
This post was last modified on February 4, 2023 6:52 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…