Political News

చ‌చ్చే వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే-పోసాని

పోసాని గ‌తంలో జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీల కోసం ప‌ని చేసి 2019 ఎన్నిక‌ల‌కు కొన్నేళ్ల‌ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జ‌గ‌న్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా మారారు. వైకాపా కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేసిన పోసాని.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మూడేళ్ల‌కు పైగా ప‌ద‌వేమీ రాక‌పోయినా మౌనంగానే ఉన్నారు. ఐతే ఆలీకి ఓ ప‌ద‌వి ఇచ్చిన‌ట్లే ఇప్పుడు పోసానికి కూడా ఓ ప‌ద‌వి కేటాయించేశారు జ‌గ‌న్.

ఏపీ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే పోసానిని జ‌గ‌న్ స‌ర్కారు నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ఏపీ మంత్రులు, కొంద‌రు సినీ ప్రముఖుల స‌మ‌క్షంలో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు పోసాని. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్‌ను ఆకాశానికెత్తేశారు. తాను చ‌చ్చేవ‌ర‌కు జ‌గ‌న్‌తోనే ఉంటాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

“జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగారిని మొన్న‌టిదాకా నేను ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌లేదు. ఆయ‌న ఎన్నోసార్లు న‌న్ను పిలిచారు. కానీ వెళ్ల‌లేదు. దూరం నుంచి చూసి అభిమానించేవాడిని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. చాలామంది నాయ‌కులు కులాల్లోంచి, మ‌తాల్లోంచి, డ‌బ్బులోంచి పుడ‌తారు. కానీ జ‌గ‌న్ గారు జ‌నాల్లోంచి పుట్టిన నాయ‌కుడు. అందుకే నాకు ఇష్టం. ఊపిరి పోయే వరకు సీఎం జగన్‌తోనే ఉంటా. జ‌గ‌న్ గారు హానెస్ట్, హాటెస్ట్, గ్రేటెస్ట్, న‌థింగ్ బ‌ట్ ఎవ‌రెస్ట్” అంటూ జ‌గ‌న్‌ను కొనియాడారు పోసాని.

ఇక ఏపీ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా తాను సినీ పరిశ్రమకు ఎంత మంచి చేస్తానో తెలియదు కానీ, చెడు మాత్రం చేయనని పోసాని అన్నారు. కార్పొరేష‌న్ కోసం జ‌గ‌న్ గారు నేను కోరిన‌న్ని డ‌బ్బులు ఇస్తార‌ని అనుకుంటున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

This post was last modified on February 4, 2023 6:45 am

Share

Recent Posts

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

33 seconds ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

7 minutes ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

1 hour ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

2 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago