రాజకీయాల్లో పేకాట తరహా సూక్తులు వినిపించడం కొత్తకాదు. అన్నమీద తమ్ముడు.. అక్కపై చెల్లి పోటీ చేసిన సందర్భాలు ఈ దేశంలో కామన్. అలానే తండ్రి, తనయులు కూడా పోటీ చేసిన సందర్భాలు ఏపీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంటోంది. కర్ణాటకలో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీ స్థాపించిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన రెడ్డి.. తన తమ్ముడిపై భార్యను పోటీకి దింపనున్నట్లు ప్రకటించారు.
ఎవరినో ఓడించేందుకు తాము పోటీ చేయడం లేదన్న ఆయన.. నెల రోజుల వయసున్న పార్టీతో రాష్ట్రంలోని నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మరో మూడు మాసాల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పక్కా వ్యూహం తో ముందుకెళ్తున్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పేరుతో పార్టీ స్థాపించిన ఆయన.. పోటీకి దిగే అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తున్నా రు. ఇందులో భాగంగా బళ్లారి-సిటీ నియోజకవర్గంలో తన భార్య అరుణ లక్ష్మిని పోటీకి దించనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఈ స్థానానికి బీజేపీలో ఉన్న జనార్దన రెడ్డి తమ్ముడు గాలి సోమశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ సోమశేఖరరెడ్డికి ఇదే టికెట్ ఇస్తే.. బళ్లారి సిటీ నియోజకవర్గంలో వదిన-మరిదిల పోటీ రసవత్తరంగా మారుతుందన్నమాట. ఇదిలావుంటే, గాలి జనార్దన్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యుల మధ్యే పోటీ!
జనార్దన రెడ్డి సోదరులైన కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డి ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. కరుణాకర రెడ్డి హరపనహళ్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరితో పాటు గాలి సన్నిహితుడైన కర్ణాటక మంత్రి శ్రీరాములు సైతం బీజేపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ.. రానున్న ఎన్నికల్లో సోమశేఖర రెడ్డిని బళ్లారి నుంచే బరిలోకి దించితే కుటుంబ సభ్యుల మధ్య పోరుకు తెరతీసినట్లవుతుంది.
This post was last modified on February 1, 2023 9:41 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…