Political News

అన్న‌ద‌మ్ముల ‘రాజ‌కీయం’.. ఇర‌కాటంలో వైసీపీ!

చాలా మంది అన్న‌ద‌మ్ములు, త‌ల్లీ కుమార్తెలు కూడా రాజ‌కీయం చేస్తున్నారు. అయితే.. అంద‌రూ ఒకే పార్టీలో ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌, స‌త్య‌లు టీడీపీలోనే ఉన్నారు. శ్రీకాకులంలో ప్ర‌తిభా భార‌తి, గ్రీష్మ‌లు కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే.. వైసీపీ విష‌యానికి వ‌స్తే మాత్రం కొంత భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

వైసీపీలో ఉన్న వారిలో ఒక‌రు టీడీపీలో ఉంటే.. మ‌రొక‌రు వైసీపీలో ఉన్నారు. దీంతో రాజ‌కీయాలు ఎలా సాగుతాయ‌నేది ప్ర‌శ్న‌. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోద‌రుల విష‌యాన్ని తీసుకుంటే.. బీద మ‌స్తాన్ రావు.. బీఎంఆర్ సంస్థ‌ల‌కు అధినేత‌. ఈయ‌న సోద‌రుడు బీద ర‌విచంద్ర యాద‌వ్ కూడా ఈ సంస్థ‌కు భాగ‌స్వామి. అయితే.. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఇద్ద‌రూ టీడీపీలోనే ఉన్నారు.

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి ఓడిపోయిన మ‌స్తాన్ రావు.. ఆవెంట‌నే వ‌చ్చి వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు కొన్నాళ్ల కింద‌ట రాజ్య‌స‌భ సీటును కూడా ఆఫ‌ర్ చేశారు. స‌రే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాగోలా గ‌డిచిపోయిన రాజ‌కీయం.. ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యం లో మ‌స్తాన్‌రావును ఇర‌కాటంలోకి నెట్టింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరులో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను మ‌స్తాన్‌రావుకు అప్ప‌గించాల‌ని అధిష్టానం చూస్తోంది. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. చేతిలో రాజ్య‌స‌భ సీటు ఉండ‌డంతో ఆయ‌న‌కు ప్ర‌త్య‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో ఉంది. మ‌రోవైపు.. ర‌విచంద్ర ఇప్ప‌టికే జిల్లా టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఈయ‌న‌కు కూడా టీడీపీ జిల్లాలోని కొన్ని మెజారిటీ స్థానాల‌ను గెలిపించే బాధ్య‌త అప్ప‌గించాల‌ని చూస్తోంది.

దీంతో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములురాజ‌కీయ సుడిలో చిక్క‌కుకున్న‌ట్టు అయింది. ఇది.. వైసీపీకి న‌ష్టం చేకూరుస్తుంద‌నిప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న మ‌స్తాన్‌రావు వెంట వైసీపీలో న‌డిచేందుకు ఆయ‌న అనుచ‌రులు రెడీగా లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో.. చూడాలి.

This post was last modified on January 21, 2023 7:53 am

Share
Show comments
Published by
Satya
Tags: BMRNellore

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

40 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

1 hour ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

5 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

5 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

7 hours ago