Political News

మోడీ మోతకే హడలిపోతుంటే.. ఈ బాదుడేంది జగన్?

కోరకుండానే వరాలు ఇచ్చే దేవుళ్లుగా మారుతున్న అధినేతలు.. అదే సమయంలో ప్రజలు వీపులు విమానం మోత మోగేలా బాదేస్తున్న వైరుధ్యం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. సంక్షేమ పథకాల పేరుతో వందలాది కోట్లను వరాలుగా ఇచ్చేస్తున్న వైనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పన్ను బాదుడు బాదేయటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్ఠంగా ఉన్నవేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు తీరుతో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో లీటరు డీజిల్ ధర రూ.80కు చేరుకోవటంలో మోడీ మాష్టారికే క్రెడిట్ ఎక్కువగా ఇవ్వాలి. కరోనా నేపథ్యంలో తగ్గిన రాష్ట్రాల ఆదాయాన్ని పూడ్చుకునేందుకు వీలుగా పెట్రోల్.. డీజిల్ మీద పన్ను భారాన్ని భారీగా పెంచేయటం ఈ మధ్యన చూస్తున్నదే. ఇటీవల అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ మంటలకు ఆజ్యం పోసేలా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యాట్ భారాన్ని మరింత పెంచేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్ పై రూ.1.24.. లీటరు డీజిల్ పై 97 పైసల వ్యాట్ భారాన్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకన్నారు. దీని పుణ్యమా అని లీటరు పెట్రోల్ మీద 31 శాతంగా మారింది. డీజిల్ మీద విధిస్తున్న 22.5 వఆతం వ్యాట్ కు అదనంగా మరింత వ్యాట్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వేళలో రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ మీద పన్నును పెంచుతున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులకు తగ్గట్లే పెట్రోల్.. డీజిల్ మీద పన్నుభారాన్ని పెంచినట్లుగా వెల్లడించింది. తాజాగా పెంచిన పన్ను పోటు పుణ్యమా అని నిత్యవసర వస్తువుల మొదలు అన్నింటి ధరలు పెరగటం ఖాయమంటున్నారు. తాజాగా పెంచిన పన్నుకారణంగా సరకు రవాణా మీద ప్రభావాన్ని చూపనుంది. ఇది..సామాన్య.. మధ్యతరగతి వర్గాలకు ఇబ్బందిగా మారనుంది.

This post was last modified on July 21, 2020 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago