తాజాగా ఖమ్మం వేదికగా.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ నిర్వహించిన ఆవిర్భావ సభ హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే.. ఈ సభావేదికగా.. కేసీఆర్ చేసిన రెండు వ్యాఖ్యలు.. రెండు అంశాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఒకటి విశాఖ ఉక్కు విషయం. రెండు జల వినియోగం. ఈ రెండు కూడా లోకల్ ఇష్యూలే. అయితే.. ఈ రెండు విషయాల్లోనూ… కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మోడీని ఢీకొట్టడం వీరి వల్ల కాదనే భావన వ్యక్తమవుతుండడం గమనార్హం.
ఒకింత చిత్రంగా ఉన్నప్పటికీ.. నిజమే. ఎందుకంటే.. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అడ్డుకునేం దుకు ఇక్కడి ఉద్యోగులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ.. కేంద్రం మాత్రం ముందుకే సాగుతా మని తేల్చి చెబుతోంది. అయితే.. ఈ క్రమంలో ఏపీ తరఫున సీఎం జగన్ ఇలా చేయొద్దంటూ.. లేఖలు సంధించారు.
ఇది ఎలా ఉన్నప్పటికీ.. కేసీఆర్ తాజాగా.. చేసిన ప్రకటన డొల్లేనని తేలిపోయింది. ఎలాగంటే.. ఇప్పుడు విశాఖ ఉక్కును అమ్మేస్తే అమ్మేయనీయండి.. మేం (బీఆర్ ఎస్) అధికారంలోకి వచ్చాక.. తిరిగి కొంటాం అన్నారు. ఇది ఎంత మేరకు విశ్వసంచాల్సిన అంశం అనేది గమనార్హం. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి దొంగ తనం జరగకుండా కాపాడుకోవాలి. అంతేకానీ.. తాళాలు ఇచ్చేసి మీరు దొంగతనం చేసుకోండి.. తర్వాత రికవరీ చేసుకుంటాం అంటే బాగుంటుందా?
ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు కూడా ఇలానే ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ కరణ చేయకుండా అడ్డుకునేందుకు ఒక్క ప్రయత్నం చేయని కేసీఆర్.. తర్వాత కొంటానని చెబుతున్నారు. అంటే.. మోడీని ఇప్పుడు నిలువరించే శక్తి లేదని స్ఫష్టమవుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, దేశంలో 70 శాతం నీటి వనరులు అందుబాటులో ఉంటే 20 శాతం వృథా అవుతోందని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే.. మొత్తం వినియోగంలోకి తెస్తామన్నారు. కానీ.. ఏపీ తెలంగాణ ల మధ్యే జలవనరుల విషయంలో సర్దుబాటు లేనప్పుడు.. దేశం మొత్తాన్ని ఎలా గాడిలో పెడతారో.. కేసీఆర్ చెప్పాలి. ఏదేమైనా.. మోడీని అడ్డుకోవాలన్న తాపత్రయం ఉన్నప్పటికీ ధైర్యం కనిపించడం లేదని.. మేధావి వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on January 19, 2023 2:16 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…