రోటీన్ కు భిన్నమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే హెల్త్ బులిటెన్ లో చోటు చేసుకుంది. కోవిడ్ 19 కేసులు నమోదవుతున్న వేళ నుంచి ఇప్పటివరకూ నాలుగైదు రోజుల మినహా.. మిగిలిన రోజులన్ని హెల్త్ బులిటెన్ ను ఎప్పుడు విడుదల చేస్తారో తెలీని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అయితే రాత్రి.. పదకొండు గంటల సమయంలోనూ రిలీజ్ చేసిన పరిస్థితి. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం రాత్రి ఎనిమిది గంటల సమయానికే విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… హైదరాబాదులో కేసుల సంఖ్య పడిపోయింది.
ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 1198 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 46,274 గా తేలితే.. ఈ రోజు మరణాలు ఏడుగా పేర్కొన్నారు. దీంతో.. ఇప్పటివరకూ మరణించిన వారు 422గా చేరింది.
రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 11,530గా పేర్కొన్నారు. దీంతో.. నెగిటివ్ కేసులతో పోలిస్తే.. పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గినట్లైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జీహెచ్ ఎంసీలో కేవలం 510 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 106 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ లో 87.. మేడ్చల్ లో 76 కేసులు నమోదు కాగా.. వరంగల్ లో 73 కేసులు నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాలకు నాలుగు జిల్లాల మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావటం గమనార్హం. అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో యాదాద్రి భువనగిరి 1, వరంగల్ రూరల్ 1, నిర్మల్ 1, సిద్దిపేట 3, మంచిర్యాల 3, ఖమ్మం 3, గద్వాల 3, అసిఫాబాద్ 4 కేసులు నమోదయ్యాయి.
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్ పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అందులోని తప్పుల మీదా ఫైర్ అయ్యింది. ఇలాంటి సందర్భాల్లో రోజు కంటే ముందే విడుదల చేసిన బులిటెన్ లో మరో ఆసక్తికర అంశం.. హైదరాబాద్ మహానగరంలో చాలా తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావటం.
This post was last modified on July 21, 2020 7:45 am
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…
బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు…
వెంకటేష్ కెరీర్ లో మొదటి వెబ్ సిరీస్ గా వచ్చిన రానా నాయుడుకు వ్యూస్ మిలియన్లలో వచ్చాయి కానీ కంటెంట్…