రాత్రి పూట కర్ఫ్యూ, పగటి పూట ఆఫీసు. ఇవే ఉంటాయి. ఆరేడు అయితేనే దుకాణం బంద్ కావచ్చు. ఎంటర్ మైంట్ జోన్లేమీ ఉండవు. షాపింగ్ మాల్సేమీ ఉండవు. కళ్యాణ వేదిక తెరచుకోవు. శిల్పారామాల్లో సేద తీరలేవు. నార్మల్సీ అనేది ఇప్పట్లో తీరే కోరిక కాదు. తెలంగాణలో అందరూ రికవరీ అయ్యి, జీరో పేషెంట్ చూసిన 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుంది. అపుడు కూడా కొన్ని నిబంధనలుంటాయి. స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉంది అని హాయిగా పీలుద్దామనుకునే పరిస్థితేం ఉండదు. ముఖానికి మాస్కుండాల్సిందే… ఉమ్మితే స్టేషనుకు పోవాల్సిందే.
ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం… తెలంగాణలో జీరో పేషెంట్ అనేది కేవలం జూన్ నెలలోనే సాధ్యం. అంతవరకు ఇది ఆంక్షల తెలంగాణయే. తాను కలలు కన్న తెలంగాణ సాధ్యం కావాలంటే… కేసీఆర్ తనంతట తాను పెట్టుకున్న లక్ష్యం కరోనాపై విజయం. అదున్నంత వరకు ప్రపంచాన్ని జయించినా ఫలితం శూన్యం.
ఇక ఇదంతా ఒకెత్తు అయితే… మొన్న లింక్డ్ ఇన్ లో మోడీ చేసిన పోస్టు చదివారో లేదో… ఆఫీసులో విరామ సమయపు ముచ్చట్లకు అనుమతించరు. ఎవరి పని వారు చూసుకుని వెళ్లాల్సిందే. పదేపదే కాన్పరెన్సులే ఉండవు. ఉల్లంఘిస్తే ఏమవుతుంది అంటే అదంత ఈజీ కాకపోవచ్చు. పొరపాటు సిబ్బందిలో ఏ ఒక్క కేసు నమోదు అయినా… ఆ సీసీ ఫుటేజీ కంపెనీ తాట తీస్తుంది. నలుగురితో కలిస్తేనే తప్ప పొద్దుపోని మనకు చాలా కష్టకాలం వచ్చింది… తప్పదు అలవాటుచేసుకోవాలి మరి ! వేలాది మందితో హడావుడిగా పెళ్లిళ్లు చేసుకునే మనం అమెరికన్లు, యూరోపియన్లలా వంద నూటా యాభై మందితో తంతు కానిచ్చేయాల్సింది. ఇది 2020 కాదు … విడదీసి చదవండి.. 20 20. అంతే ఈ ఏడాది జీవితం అంతే !! వేలు పోయి పదులు ఇరవైలే మిగుల్తాయి.