ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూస్తే ఇంతకాలం వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ పేరు చేబితేనే జనంలో వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం సభలు వెలవెలబోతుంటే.. టీడీపీ నిర్వహించే సభలు మాత్రం ఫుల్లుగా కనిపిస్తున్నాయి. దానితో అధికార పార్టీ నేతల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలో వైసీపీకి రెండు ఎంపీ సీట్లు, 14 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. మూడు రోజులపాటు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం నుంచి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఆ కార్యక్రమానికి భారీగా జనం తరలి వచ్చారు. దానితో ఓర్వలేక కొందరు వైసీపీ వాళ్లు.. లాయర్లను రెచ్చగొట్టి ధర్నా చేయించారు. ఇదేమీ ఖమ్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం కూడా కర్నూలు జిల్లాలో నిర్వహిస్తారని చెబుతున్నారు…
కోట్ల నాయకత్వమే అడ్వాంటేజ్
కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అత్యంత శక్తిమతుండిగానూ, కీలకంగానూ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వేదవతి ప్రాజక్టు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ.. పాదయాత్ర చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి నుంచి గూల్యం వరకూ దాదాపు 12 కిలోమీటర్ల పాదయాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది కోట్ల దంపతుల పాదయాత్రలో టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అమర్‌నాథ్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా రావడంతో టీడీపీకి ఎక్కడ లేని బలం వచ్చింది…
సూర్య ప్రకాశ్ పైనే అధిష్టానానికి గురి
వచ్చే ఎన్నికల నాటికి సూర్య ప్రకాశ్ రెడ్డికి ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లా పార్టీలో ఆమె పట్ల వ్యతిరేకత పెరుగుతోందట. ఈ సారి టికెటివ్వడం కూడా అనుమానమేనని అంటున్నారు. జిల్లాలోని ఇతర నేతలు కూడా వైసీపీతో పోరాడేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కుమారుడైన సూర్యప్రకాశ్ మాత్రం వైసీపీని ధైర్యంగా ఎదుర్కునే ఛాన్సుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఆ సంగతి గ్రహంచిన సూరీడు కూడా తన అనుచరులను అలెర్ట్ చేశారట. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని క్రీయాశీలంగా మార్చివేసి, చంద్రబాబు దృష్టిని ఆకర్షించాలని తమ వర్గం కార్యకర్తలను ఆయన ఆదేశించారు.
This post was last modified on December 27, 2022 12:13 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…