జూనియర్ ఎన్టీఆర్.. అచ్చం తాతలాగే ఉంటాడు. కెమెరా ముందుకు వచ్చాడంటే నటనను పండించేస్తాడు. నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్, ఆది సినిమాల నుంచి ఇప్పటి ట్రిపుల్ ఆర్ దాకా అన్ని సూపర్ హిట్లే. ఒక దశలో జూనియర్ రాజకీయాల వైపు కూడా చూశాడు. తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశాడు. తర్వాత నటనపై దృష్టి పెట్టేందుకు సైడై పోయాడు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటూనే ఉన్నారు. జూనియర్ రాజకీయాల్లోకి వస్తే తాతలాగే ప్రజా సేవకు అంకితమవుతాడని విశ్వసిస్తున్నారు. తరచూ చంద్రబాబు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు జూనియర్ కు మద్దతుగా నినాదాలు వినిపిస్తున్నారు. ఎన్టీఆర్ జెండాలతో అభిమానులు ప్రదర్శనలు చేస్తున్నారు. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి కుప్పం దాకా ఈ నినాదాలు మారుమోగాయి.
ఖమ్మంలోనూ ఎన్టీఆర్ మాట
ఖమ్మంలో ఇటీవల టీడీపీ భారీ బహిరంగ సభ జరిగింది. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన సభలో చంద్రబాబు గంటకు పైగా మాట్లాడారు. అప్పుడే కొందరు జూనియర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. జూనియర్ ను వెంటనే పార్టీలోకి తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పగించాలని కోరారు.. అయితే జనం హోరులో వారి నినాదాలు కొట్టుకుపోయాయి..
జూనియర్ ప్రస్తావన తెచ్చిన ఎర్రబెల్లి
ఖమ్మం సభలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ పాలనను ప్రస్తావించారు. హైటెక్ సిటీ మొదలుకుని చాలా విషయాలు చెప్పారు. తెలంగాణకు టీడీపీ అవసరం ఉందని చెప్పుకున్నారు. దానితో తమకు మళ్లీ పోటీ వస్తున్నారని అధికార బీఆర్ఎస్ భావించినట్లుంది. అధికార పార్టీ నేతలు చంద్రబాబుపై మూకుమ్మడి దాడికి దిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఒక అడుగు ముందుకేసి… తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని.. ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారన్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. టీడీపీపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే.. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు జూనియర్ అభిమానులు రుచించి ఉండొచ్చు కానీ.. టీడీపీలో చిచ్చు పెట్టేవిగా ఉన్నాయని చెప్పాలి. మా పార్టీ అంతర్గత వ్యవహారం మీకెందుకని టీడీపీ నేతలు ఎర్రబెల్లిని ప్రశ్నిస్తున్నారు….
This post was last modified on December 23, 2022 12:12 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…