తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యే హైదరాబాద్‌లో తన ప్రోత్సాహంతో ఏర్పాటైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియోల కంటే.. ఆయన గురించి ఐఎస్‌బీ ప్రతినిధులు, ఆ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ప్రముఖులు చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబు విజన్ గురించి.. ఐఎస్బీకి ఆయన అందించిన ప్రోత్సాహం గురించి వాళ్లు చెబుతుంటే.. చంద్రబాబు అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి.
న్యూట్రల్ జనాలకు కూడా ఆ మాటలు గొప్పగా అనిపించాయి. చంద్రబాబు మీద గౌరవభావం కలిగించాయి. ఒక రెండు రోజుల పాటు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. మనం ఏదైనా మంచి చేస్తే దాని గురించి మనం చెప్పుకోవడం కంటే వేరే వాళ్లు చెబితే వచ్చే ఎలివేషన్ వేరుగా ఉంటుంది అనడానికి ఇది ఉదాహరణ.
ఐతే ఎంతో తెలివైన వ్యక్తిగా, రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు ఇంత చిన్న లాజిక్ అర్థం కాక ఎప్పటికప్పుడు తప్పులో కాలేస్తుంటారు. తన గొప్పను తాను చెప్పుకునే క్రమంలో హద్దులు దాటిపోతుంటారు. మాటలు అటు ఇటు అయి వేరే అర్థం వచ్చేలా మాట్లాడి ప్రత్యర్థులకు దొరికిపోతుంటారు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో దుష్ప్రచారాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అది తెలిసి కూడా తన గొప్పలు తాను చెప్పుకునే క్రమంలో బుక్ అయిపోవడం చంద్రబాబుకు అలవాటు.
ఖమ్మంలో సూపర్ సక్సెస్ అయిన తెలుగుదేశం సభలోనూ ఆయన అలాగే చేశారు. కరోనా వైరస్ కనుగొనడానికి తెలుగుదేశం పార్టీయే కారణం అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. నిజానికి ఆయన ఉద్దేశం ఏంటంటే.. తన ప్రోద్బలంతో ఏర్పాటైన జినోమ్ వ్యాలీ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించిందని, అక్కడ ఏర్పాటైన భారత్ బయోటెక్ సంస్థే కోవాగ్జిన్ తయారు చేసి దేశాన్ని కాపాడింది అని. కానీ సోషల్ మీడియా జనాలకు ఇదంతా ఎందుకు? ‘‘కరోనా వ్యాక్సిన్ రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ’’ అనే పాయింట్ మాత్రం తీసుకుని చంద్రబాబు సెల్ఫ్ డబ్బా అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.
గతంలో దేశంలో సెల్ ఫోన్ విప్లవానికి పరోక్షంగా తనే కారణం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అటు ఇటు మారి సెల్ ఫోన్ కనిపెట్టింది తనే అని చంద్రబాబు అన్నట్లుగా ప్రచారంలోకి వెళ్లాయి. విమర్శలు తప్పలేదు. ఇలా పలుమార్లు తన వ్యాఖ్యలు ట్రోల్స్‌కు దారి తీస్తున్నా చంద్రబాబులో మార్పు రావడం లేదు. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం తగ్గించడం, అలాగే చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, మరో అర్థం రానివ్వకుండా మాట్లాడడం అవసరం.
This post was last modified on December 22, 2022 11:16 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…