మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. . తాజాగా విజయవాడలోని ఓ హోటల్ లో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చసాగుతోంది. వాస్తవానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయకులు. గంటా, బొండా ఇద్దరూ టీడీపీలో ఉన్నారు. కన్నా మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు.
అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. వచ్చే ఎన్నికలు సమీపి స్తున్న నేపథ్యంలో వీరు ఒకే చోట భేటీ కావడం వంటివి ఆసక్తికర చర్చకు దారితీశాయి. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. గత మూడేళ్లుగా మౌనంగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ.. పలు దఫాలుగా చర్చకు వచ్చినా.. ఆయన ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడింది లేదు.
ఇక, కన్నా కూడా బీజేపీలోనే ఉన్నప్పటికీ ఆయన ఇటీవల పార్టీ రాష్ట్ర శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజుపై ఆయన బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన జనసేనతోనూ టచ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. పైకి స్తానిక విషయాలు చర్చించుకున్నామనిచెబుతున్నా.. ఆయన అంతరంగం మాత్రం పార్టీ మారాలనే ఉద్దేశంతోనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక, బొండా ఉమా కూడా టీడీపీలో నామ్ కే వాస్తే.,. అన్నట్టుగా మారిపోయారు. తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలవడం.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుకావడం.. ఎన్నికల వేళ చర్చలకు దిగడం వంటివి ప్రాధాన్యం దక్కించుకున్నాయి. వీరు ముగ్గురూ కూడా జనసేనలో కివెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారనేది పరిశీలకుల అంచనా. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్న పవన్ వైపు వీరు మొగ్గే అవకాశం ఉందని.. అందుకే చర్చలకు దిగారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 16, 2022 6:44 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…