Political News

గుజ‌రాత్‌లో బీజేపీ గెలుపు.. టీడీపీకి ఓ లెస్స‌న్‌!

తాజాగా జ‌రిగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చింది. అయితే..ఈ విజ‌యం ద‌క్క‌డం ఈ పార్టీకి ఇది దాదాపు 7వ సారి. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌శ్చిమ బెంగాల్ క‌మ్యూనిస్టుల విజ‌యాన్ని ప‌క్క‌కు నెట్టి శ‌తాబ్ది విజ‌యాన్ని అందుకున్న‌ట్టు అయింది.

అయితే.. Gujarat లో BJP గెలుపు ఒక్క‌రోజులోనో.. ఎలాంటి ప‌రిశ్ర‌మా చేయ‌కుండానో ద‌క్క‌లేదు. అడుగ‌డుగూ.. అణువ‌ణువూ గెల‌వాల‌న్న పార్టీ నేత‌ల త‌ప‌న‌.. కీల‌క నేత‌ల వ్యూహాలు.. వీటికి మించి.. మోడీ చ‌రిష్మా ఇవ‌న్నీ కూడా.. క‌ల‌గ‌లిసి.. గుజ‌రాత్ మిఠాయిని బీజేపీకి అందేలా చేశాయి. వాస్త‌వానికి బ‌ల‌మైన ప్ర‌తిపక్షం అనుకున్న కాంగ్రెస్ ఎన్నిక‌లకు ముందు చేసిన విన్యాసాలు బీజేపీకి బాగా క‌లిసి వ‌చ్చాయి.

ఇక్క‌డ ఇంకో విష‌యం చెప్పాలి. Gujarat లో అధికారంలో ఉన్నాం క‌దా.. అనే ధీమాను బీజేపీ వ్య‌క్త‌ప‌ర‌చ‌లేదు. ఎక్కడిక‌క్క‌డ ఎప్ప‌టిక ప్పుడు.. మార్పులు చేసుకుంది. అవ‌స‌రం అయితే.. సీఎం అంత‌టి వాడిని ప‌క్క‌న పెట్టింది. తాజా ఎన్నికలకు ఏడాది ముందుగానే విజయ్‌ రూపానీ, ఆయన మంత్రివర్గాన్ని బీజేపీ పక్కనపెట్టింది.

అంటే క‌ఠిన నిర్ణ‌యాలు ఎలా ఉంటాయో.. ఇది నిరూపిస్తుంది. ఇక‌, ఏపీకి వ‌స్తే.. Gujarat ఎన్నిక సారాంశం .. TDP నేత‌ల‌కు ఒక చ‌క్క‌ని పాఠం వంటింది. ఎందుకంటే..ఇక్క‌డ TDP నాయ‌కులు కేవలం చంద్ర‌బా బు ఇమేజ్‌తోనే గెలిచేస్తాం.. ఆయ‌న విజ‌న్ మ‌న‌ల్ని కాపాడేస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇది మంచిదే. కానీ, ఎంత ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. మోడీ క‌న్నా.. ఎక్కుగా క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పోటీ ప‌డ్డారు.

అంతేకాదు, వీరు గెల‌వ‌రు అనుకున్న చోట బీజేపీ 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇవ్వ‌లేదు. అయితే, వీరిలో కేవ‌లం 9 మంది మాత్ర‌మే రెబ‌ల్‌గా మార‌గా మిగిలిన వారిని పార్టీ అనుకూలంగా మార్చుకుని ప‌నిచేయించుకుంది. ఫ‌లితంగా గుజ‌రాత్‌లో 7వ సారి దిగ్విజ‌య, అప్ర‌తిహ‌త అధికారం చేప‌ట్టింది. దీనిని చూసైనా ఏపీలో టీడీపీ నేతలు ఎలా ప‌నిచేయాలో నేర్చుకుంటే.. అదే అధికారం ద‌క్కేలా చేస్తుంద‌న్న‌ది నిర్వివాదాంశం.

This post was last modified on December 8, 2022 9:33 pm

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

17 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago