Political News

జనసేనాని లాంగ్ టర్మ్ ప్లాన్ ?

జనసేనాని పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ దురుసుగా మాట్లాడినా తన పొలిటికల్ స్కెచ్ మాత్రం కూల్ గానే ఉంటుంది. ఒక్కరోజులో రాజకీయాల్ని మార్చేయ లేమనీ, తనకు చాలా ఓపిక ఉందని తరచూ చెబుతుంటారు పవన్. జనసేన పార్టీని 2014 మార్చి 14 న స్థాపించారు పవన్ కళ్యణ్. 2023 మార్చికి పార్టీ ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు. చాలామంది రాజకీయ నాయకులు మధ్యలోనే పవన్ తోక ముడుస్తాడనీ, సినిమాలు చేసుకుంటాడనీ ఎద్దేవా చేశారు. కానీ.. పవన్ మాత్రం పొలిటికల్ యూ టర్న్ తీసుకోలేదు. ఐతే.. జనసేన పార్టీకి ఓ స్టాండ్ లేదన్న విమర్శల్ని మాత్రం పవన్ గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారని పొలిటికల్ ఎనలిస్టుల అభిప్రాయం.

గతంలో బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన చేతులు కలిపాయని వైసీపీ విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఈసారి కూడా దాన్నే ఆయుధంగా మలుచుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఐతే.. ఈసారి సీన్ మరో విధంగా ఉండబోతుదనీ.. ఆ దిశగానే పవన్ పావులు కదుపుతున్నాడనీ, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టబోతున్నాడనీ తెలుస్తోంది. ఇంతకీ పవన్ ఎవరితో జతకడతారు.. ? ఎటు వైపు అడుగులేస్తారు.. ? అనేది తెలియాలంటే పవన్, మోదీ భేటీలో ఏం జరిగందో తెలియాలి.

పవన్, మోదీ భేటీలో చాలా అంశాలు చర్చకొచ్చాయని లీక్స్ వస్తున్నాయి. టీడీపీతో కలసి వెళితే.. ఎలా నష్టపొతాడో పవన్ కు మోదీ క్లియర్ గా వివరించారని తెలుస్తోంది. అతేకాదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపో తుందనీ, ఆ పార్టీ ఉనికి కూడా ఉండదని మోజీ జోస్యం చెప్పారట.

అందుకే.. భవిష్యత్తు ప్రణాళికలపై కూడా చర్చ నడిచినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గల్లంతవుతుంది కాబట్టి.. రాబోయే రోజుల్లో జనసేన, బీజేపీలు ఎలా బంలం పుంజుకోవాలి అన్న వ్యూహ రచన కూడా జరిగందట. భవిష్యత్తులో పవన్ కు సీయం పీఠం అప్పగిస్తానని మోదీ ప్రామిస్ కూడా చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

దీర్ఘకాలిక ప్రణాళికతోనే పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జనసైనికుల్లో ధైర్యం నింపి, కర్తవ్యబోధ చేస్తున్నాడట. మోదీ అండతోనే వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నాడనీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

పవన్ టీడీపీతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్నారని అంటున్నారు. అదే జరిగితే.. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ పై విరుచుకుపడుతున్న వైసీపీ నేతల విమర్శలకు బ్రేకుల పడినట్లే అవుతుంది. మరి పవన్ లాంగ్ టర్మ్ ప్లాన్ సరైన ఫిలితాల్నిస్తుందో లేదో చూడాలి.

This post was last modified on December 1, 2022 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప-2 ఓపెనింగ్‌పై పోల్స్, బెట్టింగ్స్

మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్‌ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…

5 hours ago

రానాను చిరు ఎందుకు కొట్టాడు?

రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…

7 hours ago

సమంతను మ్యాచ్ చేయగలదా అన్నారు.. కానీ

‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…

9 hours ago

సినిమాల్లాగా రాజ‌కీయాల్లోనూ సైలెంట్ స‌క్సెస్‌!

కోలీవుడ్‌లో పిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాయించుకున్న‌యువ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…

10 hours ago

శివన్న సైలెంటుగా హిట్టు కొట్టేశాడు

జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…

10 hours ago