Movie News

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే పాటకు నెగటివిటీ వచ్చింది. హరీష్ శంకర్ గత సినిమా మిస్టర్ బచ్చన్ పెద్ద డిజాస్టర్. ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో ఊపు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ స్టేట్మెంట్లన్నీ నిజమే. కానీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ముందు ఈ మైనస్సులు పని చేయడం లేదు.

ఆలస్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టినప్పటికీ బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో లక్షా పదహారు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. దురంధర్ ది రివెంజ్ కు అతి దగ్గరలో అవర్లీ ట్రెండింగ్ జరగడం మరో స్పెషల్ ట్విస్ట్. అది ప్యాన్ ఇండియా భాషల్లో వస్తుండగా పవన్ మూవీ కేవలం సింగల్ లాంగ్వేజ్ తెలుగులోనే రిలీజవుతోంది. అలా చూసుకుంటే ఉస్తాద్ కన్నా ఎక్కువగా పవ పేరే పని చేస్తోన్న వైనం స్పష్టం.

ఇప్పటికే ఇరవై కోట్లకు దగ్గరగా వెళ్తున్న గ్రాస్ రేపు ఉదయం నాలుగు గంటలకు తొలి షో పడేలోపు మరింత మెరుగైన నెంబర్లు నమోదు చేయడం ఖాయం. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ ప్రీమియర్లు లాంటి వాటికి వెసులుబాటు దొరక్కపోవడంతో కలెక్షన్లలో కొంత తగ్గుదల ఉంటుంది. అయితే ఏపీలో ధరలు పెంచుకునే సౌలభ్యం ఉండటం వల్ల ఓవరాల్ గా రెవిన్యూ బ్యాలన్స్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే టాక్ రావడం చాలా కీలకం కానుంది.

హైప్, బజ్ సంగతి పక్కనపెడితే రేపు మాట్లాడాల్సింది ఫైనల్ గా కంటెంటే. ఏ మాత్రం బాగున్నా రికార్డుల మోత ఖాయం. అసలే టాలీవుడ్ బాక్సాఫీస్ ఆకలి మీద ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఒక్క స్టార్ హీరో సినిమా లేక థియేటర్లు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఆదుకోవాల్సింది పవన్ కళ్యాణే. దురంధర్ రివెంజ్ మీద కూడా గంపెడాశలు ఉన్నాయి. మరి ఉస్తాద్ అంచనాలు అందుకుని అరాచకం ఏ స్థాయిలో చేస్తాడో తెలియాలంటే ఉదయం దాకా వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on March 18, 2026 11:19 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

22 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

52 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago