చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్ కు ఎంత ఖర్చయ్యిందో అంతే సొమ్ము ప్రమోషన్ల కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయితేనేం లాభాల వర్షంలో నిర్మాతలు తడిసిపోయారు. అలాని ప్రతి మూవీకి ఇలా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఇదే ప్రొడ్యూసర్లకు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని బాక్సాఫీస్ వద్ద పెద్ద షాక్ ఇచ్చింది.
ఇక విషయానికి వస్తే నీహారిక కొణిదెల నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన రాకాస ఏప్రిల్ 3 విడుదల కానుంది. లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ హారర్ ఫాంటసీ డ్రామాలో సంగీత్ శోభన్ హీరో. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ తర్వాత సెలెక్టివ్ గా మారిపోయిన సంగీత్ ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే రాకాసని ఆలోచించి ఎంచుకున్నాడు.
ప్రచార పర్వంలో నీహారిక ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడుతోంది. తన డెబ్యూ ప్రొడక్షన్ లో వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కమర్షియల్ గానూ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాకాస మీద కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంది. కంటెంట్ పట్ల చాలా స్ట్రిక్ట్ గా మారిపోయిన నెట్ ఫ్లిక్స్ తో ఓటిటి డీల్ చేయించడం మాములు విషయం కాదు. ఓ రేంజ్ కంటెంట్ ఉంటే తప్ప అంత ఈజీగా ఒప్పుకోరు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ రివెంజ్ హడావిడి ఉంది కాబట్టి రాకాస టీమ్ కొంచెం సైలెంట్ గా ఉంది. ఉగాది పండగ కాగానే మళ్ళీ పబ్లిసిటీ పెంచబోతున్నారు. ఏప్రిల్ 3 శర్వానంద్ బైకర్ ఉంది. దాని మీద కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. సో కాంపిటీషన్ కొంచెం టఫ్ గానే ఉంది. టీజర్ తో ఆకట్టుకున్న రాకాస బిజినెస్ డీల్స్ దాదాపుగా పూర్తయ్యాయట. హారర్ జానర్ అయినప్పటికీ టాక్ కీలకం కాబట్టి రాకాసకు అది వస్తే టెన్షన్ తీరినట్టే. చూడాలి ఏం చేస్తుందో.
This post was last modified on March 17, 2026 11:38 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…