ఔను! రాజకీయాల్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా బీజేపీలో ఉన్న ఇప్పటి తరం నేతలు ఏంచేశారన్నా.. వారికి అర్ధం పరమార్థం దక్కకుండా ఏదీ చేయరు. అది ఏదైనా కావొచ్చు. అటు పార్టీకి, లేదా వారికి ఉపయో గం ఉంటుందంటేనే అడుగుతీసి అడుగు వేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ విషయంలోనూ అదే జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రకటించారు.
ఇటీవల కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవాలని సూచించినా ఆయన పట్టించుకోలేదు. అంతేకాదు, ఇటీవల రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు కూడా మర్యాద పూర్వకంగా అయినా వచ్చి పొమ్మని కొందరు అత్యంత కీలక నాయకులు, సినీ మాజీ నటులు కూడా ఆయనకు సందేశాలు పంపించారు. కానీ, చిరు మాత్రం సున్నితంగా తిరస్కరించారు.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా ప్రధాని మోడీ వల విసురుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా ఆయనను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దీ ఇయర్ -2022 జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో(అటానమస్ అంటారు కానీ,..?) ఉంటుంది. దీనికి ఎంతో మంది దిగ్గజ నటులు పోటీ పడ్డారు. అయినా.. కూడా పట్టుబట్టి చిరును ఎంపిక చేశారు. అంతేకాదు.. కేంద్రంలోని పెద్దలు వరుస పెట్టి చిరుకు అభినందనలు తెలుపుతున్నారు.
ఈ పురస్కారానికి 100 కు 200 శాతం చిరంజీవికి అర్హత ఉన్నప్పటికీ ఇచ్చిన వారు, ప్రకటించిన వారి విషయంలోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరిలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ ప్రధాని మోడీ చిరుతో రహస్యంగా వేదికపైనే చెవిలో ఏదో చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా అవార్డు.. పైగా ఆసేతు హిమాచలం నుంచి చిరుకు కూడా తెలియని పెద్దల అభినందనలు. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఆశిస్తున్నారని, గేలం బలంగానే వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 21, 2022 4:52 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…