Political News

ఇదే చివ‌రి ఎన్నిక‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ‌, నంద్యాల‌, కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం క‌ర్నూలుకు వెళ్లిన చంద్ర‌బాబు ఇక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. ప‌త్తికొండ‌లో నిర్వ‌హించిన ర్యాలీ, అనంత‌రం స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ.. ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. గ‌త ఏడాది అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

“నేను సీనియర్ నాయకుడిని. నన్ను అవమానించిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు లేరు. కానీ, అసెంబ్లీకి వెళ్లిన నన్నే కాదు.. మా భార్యను కూడా వైసీపీ కౌర‌వ సైన్యం అవమానించింది. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని బయటకి వచ్చా, మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ సభలో అడుగు పెడతా. నేను ఆసెంబ్లీకి వెళ్లాలంటే. రాజకీయాల్లో ఉండాలంటే. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఈ ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలి. గెలిపిస్తే స‌రే! లేదంటే ఇదే నా చివ‌రి ఎన్నిక‌” అని చంద్ర‌బాబు గ‌ద్గ‌ద స్వ‌రంతో వ్యాఖ్యానించారు.

ఏపీలో మధ్యం డిస్టరీలన్నీ జగన్‌వేన‌ని చెప్పారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ఆయన బ్రాండ్లే అమ్ముతున్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. సాయంత్రం బటన్ నొక్కితే డబ్బులన్నీ ఆయనకే చేరిపోతాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో మద్యంపై దాడులు చేశారు. ఏపీలో ఎప్పుడు దాడులు చేస్తారో అనే భ‌యంతో వైసీపీ నాయ‌కులు బిక్క‌చ‌చ్చి బ‌తుకుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ప్రధాని మోడీ విశాఖకు వచ్చినప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల ద్వారా చంద్రబాబు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారని న‌న్ను కొనియారు.. అని పేర్కొన్నారు.

“మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టీడీపీనే. సమైఖ్యాంధ్రలో విజన్ -2024 తయారు చేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర విభజన తర్వాత విజన్-2029కు ప్రణాళిక చేశాం. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీని చూడాలనుకున్నాను. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న న‌ర‌కరాసురులను, నరరూప హంతకులను కట్టడి చేయడానికి మనమంతా కష్టపడాలి” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

హైకోర్టుకు నేను అడ్డుకాదు!

కర్నూలులో హైకోర్టుకు తాను అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని, తాను అడ్డు పడడం లేదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చారని, 36 మంది ఎంపీలను ఇచ్చారని, మీ కేసుల కోసం ముగ్గురు ఎంపీలను అమ్ముకున్నార‌ని వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “నేను నందిగామకు వెళితే. నాపైనే రాళ్లు వేశారు. పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెడితే గాల్లో రాళ్లు వచ్చాయంటున్నారు. రేపు పూలల్లో బాంబులు వస్తాయంటేరేమో” అని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on November 17, 2022 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

38 minutes ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

2 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

4 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

5 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

5 hours ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

7 hours ago