తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఇవి ఏపీలోనే ఉంటాయి. కానీ, కేంద్రం అజమాయిషీలోనే పనిచేస్తాయి. అంటే ఇవి కేంద్ర ప్రాజెక్టులు అన్నట్టు లెక్క! నిజ్జంగా నిజం. కానీ, ఏపీకి ఏదో ఇస్తున్నామని.. ఏపీని వెలిగిపోయేలా చేస్తున్నామని మాత్రం ప్రధాని కలరింగ్ ఇస్తుండడం గమనార్హం.
ఇంతకీ మోడీ ఏం ఇచ్చారు.. ఏపీకి ఎంత ప్రయోజనం చూద్దాం..
ప్రాజెక్టు: రూ. 2,658 కోట్లతో శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైపులైన్ (745కి.మీ.)..
ప్రయోజనం: ఇది ఏపీలో ఉంటుంది. కానీ, కేంద్రమే నిర్వహిస్తుంది.
ప్రాజెక్టు: రూ. 3,778 కోట్లతో రాయపూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్‌లో 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి
ప్రయోజనం: కేంద్ర పెట్టుబడులకు పొరుగు రాష్ట్రాల పెట్టుబడులకు అనుకూలం. దీని నుంచి ఏపీకి దక్కేది .. చిన్నపాటి సెస్సులు మాత్రమే.
ప్రాజెక్టు: విశాఖ ఎన్‌హెచ్-516సిపై కాన్వెంట్ జంక్షన్-షీలానగర్ జంక్షన్ వరకు 6 లేన్ల రహదారి
ప్రయోజనం: ఇది కేవలం రాష్ట్రం కోసం చేసిన ప్రాజెక్టు కాదు. ఇది జాతీయ రహదారి
ప్రాజెక్టు: రూ. 566 కోట్లతో విశాఖ పోర్టు కనెక్టివిటీ కోసం అదనంగా 4 లేన్ల డెడికేటెడ్ పోర్టు రోడ్డు,
ప్రయోజనం: ఇది పోర్టుల పరిదిలో ఉంటుంది. మన రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం లేదు.
ప్రాజెక్టు: రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హర్బర్ ఆధునికీకరణ
ప్రయోజనం: స్థానిక మత్స్యకారులకు కొంత ప్రయోజనం ఉంటుంది. ఇది దశాబ్దాల డిమాండ్ కూడా!
ప్రాజెక్టు: రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన
ప్రయోజనం: విశాఖ జోన్ ను గాలి కి వదిలేసి చేపట్టిన ప్రాజెక్టు. ఇది కూడా భారతీయ రైల్వేలకు ప్రయోజనకరం.. ఆదాయకరం.
ప్రాజెక్టు: ఓఎన్‌జీసీ-యుఫీల్డ్ ఆన్‌షోన్ సదుపాయాలు జాతికి అంకితం
ప్రయోజనం: కేంద్రానికి మాత్రమే. దీని నుంచి కనీసం సెస్సులు కూడా రాష్ట్రానికి రావు.
This post was last modified on November 12, 2022 11:20 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…