తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేరు ఎత్తకుండానే సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తామని వ్యాఖ్యానించారు. వాస్తవానకి ఏ నాయకుడైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతారు. కానీ ఉన్న ప్రబుత్వాన్ని కూలదోస్తామని ఎవరూ చెప్పరు. కానీ, మోడీ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా విశాఖ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తలను చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని ప్రధాని అన్నారు. తెలంగాణ బీజేపీ శ్రేణులు బలమైన శక్తులని, ఎవరికీ భయపడరని కొనియాడారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపారన్నారు.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారు. ఒక అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు పోయింది. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదు. మునుగోడులో కమల వికాసం కనిపించింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారు.. అని మోడీ అన్నారు.
హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్‌గా మారింది. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయి. మూఢవిశ్వాసాలను బీజేపీ పారదోలుతుంది. ఎర్రజెండా నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులు. అలాంటి వారితో టీఆర్ ఎస్ సర్కారు చేతులు కలిపింది. ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే బీజేపీ రాజకీయాలు చేస్తోంది.. అని ప్రధాని వ్యాఖ్యానించారు.
బీజేపీకి తెలంగాణలో సానుకూల పరిస్థితి ఉంది. కరోనా సమయంలో తెలంగాణలోనూ 2 కోట్ల మందికి రేషన్ బియ్యం పంపిణీ చేశాం. ప్రధాని ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ ఎస్ సర్కారు నిర్వీర్యం చేసింది. రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్ధి దక్కకుండా చేశారు. నా తొలి ప్రాధాన్యత ప్రజలకే.. కుటుంబానికి కాదు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే నా లక్ష్యం.. అని ప్రధాని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 12, 2022 5:34 pm
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…
టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…
ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…
కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…