కొన్ని కొన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి. నమ్మడానికి కూడా ఒకింత ఇబ్బందిగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే అతి పెద్ద జాతీయ పార్టీ బీజేపీలో కనిపిస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు.. ఈ పార్టీలోని నాయకులు వాజపేయి నుంచి అడ్వాణీ వరకు.. అందరూ కూడా.. బీజేపీని చూసి ఓటేయండి.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను చూసి గెలిపించండి.. అని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఆ సేతు హిమాచలం అందరూ కూడా ఇదే నినాదం పట్టుకుని ప్రచారం చేసిన ఎన్నికలు అనేకం ఉన్నాయి.
కానీ, ఇప్పుడు బీజేపీ రంగు మారకపోయినా.. రూపం మారకపోయినా.. ఆత్మ మాత్రం మారిపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి రెండు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండు గుజరాత్. ఈ రెండు చోట్ల కూడా.. బీజేపీ తన సిద్ధాంతాలను, రాద్ధాంతాలను వదిలేసింది. కేవలం ఒకే ఒక నాయకుడు.. మోడీని బ్రహ్మస్త్రంగా చూపిస్తోంది. ప్రతి ఎన్నికలకు కొత్త ప్రభుత్వాన్ని మర్చే సాంప్రదాయం ఉన్న హిమాచలంలో బీజేపీ తనన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మోడీనే సర్వం.. అన్న మంత్రాన్ని పఠిస్తుండడం గమనార్హం.
మీరెవ్వరినీ చూడాల్సిన అవసరం లేదు. పువ్వు గుర్తుకు వేయండి చాలు. ఆ ఓటు నాకు వేసినట్లే!.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చేసిన అభ్యర్థన ఇది. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి చెమటోడ్చుతున్న బీజేపీకి.. తమ సిద్ధాంతాలతోను.. పనితనంతోనూ పని జరగదని అర్ధమైపోయింది. కేవలం ఓటర్లలో నరేంద్ర మోడీకున్న ఆదరణపైనే అధికంగా ఆధారపడుతోంది. చూస్తుంటే పోటీ ఇక్కడ స్థానిక కాంగ్రెస్‌కు.. నరేంద్రమోడీకి మధ్య ఉందా? అన్నట్లు పరిస్థితి మారింది.
రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది నేతలున్నా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైనా.. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కించే బాధ్యత పూర్తిగా మోడీపైనే పడిందంటే.. ఒక జాతీయ పార్టీని.. అందునా ఆర్ఎస్ఎస్ మూలాలున్న పార్టీని మోడీ ఎలా శాసిస్తున్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. తిరుగుబాటులతో పాటు విపక్షాలపైనా బీజేపీ తమ బ్రహ్మాస్త్రంగా ప్రధాని నరేంద్రమోడీనే నమ్ముకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆయన కరిష్మాతో గట్టెక్కి.. చరిత్రను తిరగ రాయాలనుకుంటోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు అయితే.. చేయొచ్చు.. కానీ, బీజేపీ జవం.. జీవం.. అనదగిన ఆర్ఎస్ఎస్ పోయి.. మోడీ ఆత్మ అయితే.. మున్ముందు పార్టీకి ప్రయోజనమేనా? అన్నది ఆర్ ఎస్ ఎస్ వాదుల్లో తలెత్తుతున్న ప్రశ్న.
This post was last modified on November 11, 2022 7:22 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…