Political News

రాజ‌గోపాల్ రెడ్డి మెడ‌కు ‘స‌న్యాసం’ స్టేట్మెంట్

ఈ సోష‌ల్ మీడియా కాలంలో ఫిలిం సెల‌బ్రెటీలైనా, పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌యినా.. ఏవైనా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేట‌పుడు కొంచెం ముందు వెనుక ఆలోచించుకోవ‌డం మంచిది. తొంద‌ర‌ప‌డి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ త‌ర్వాత అటు ఇటు అయితే మీడియా వాళ్లు, సోష‌ల్ మీడియా జ‌నాలు వారిని మామూలుగా టార్గెట్ చేయ‌రు. ఇప్పుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక‌కు ముందు చేసిన తొంద‌ర‌పాటు కామెంట్ వ‌ల్ల తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున ఉప ఎన్నిక‌లో పోటీ చేసిన రాజ‌గోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి చేతిలో 11 వేల‌కు పైగా ఓట్ల తేడాతో ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఐతే ఎన్నిక‌ల‌కు ముందు ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు రాజ‌గోపాల్ రెడ్డి.

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిని కేసీఆర్ గెలిపించుకుంటే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ఆయ‌న అన్నారు. దీనికి యాంక‌ర్ స్పందిస్తూ.. ఆలోచించే ఈ మాట అంటున్నారా, త‌ర్వాత మేం ఇదే స్టేట్మెంట్‌ను తిప్పి తిప్పి వేస్తాం, చూస్కోండి మ‌రి అన్నా కూడా రాజ‌గోపాల్ రెడ్డి వెన‌క్కి త‌గ్గ‌లేదు. టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా అంటూ స‌వాలు చేశారు. క‌ట్ చేస్తే ఇప్పుడు కొంచెం పెద్ద తేడాతోనే ఓట‌మి చ‌విచూశారు.

దీంతో టీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులే కాక‌, బీజేపీ అంటే ప‌డ‌ని వాళ్లు, అలాగే కోట‌మిరెడ్డి సోద‌రుల వ్య‌తిరేకులు ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. రాజ‌గోపాల్ రెడ్డీ.. ఎప్పుడు రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటున్నావ్? త‌ర్వాత ఏం చేయ‌బోతున్నావ్? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మ‌రి దీనికి రాజ‌గోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.

This post was last modified on November 6, 2022 10:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

5 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago