వారుసులకు టికెట్లు ఇచ్చేది లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేసినా.. నాయకులు మాత్రం వెనక్కి తగ్గేదిలేదన్నట్టు ముందుకే సాగుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సహా.. కీలక నేతలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి వరకు ఓ పది మంది పేర్లు వినిపించగా.. ఈ జాబితా ఇప్పుడు మరింత పెరిగిందని అంటున్నారు. కొత్తముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున సీఎం జగన్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
“ఇప్పుడు సీఎం గారికి కావాల్సింది ఏంటి? పార్టీ గెలిచి..మళ్లీ ఆయన సీఎం కావడమే కదా! దీనికి మేం హామీ ఇస్తున్నాం. మా తనయుడు పోటీలో ఉన్నా.. అంతా మేమే చూసుకుంటాం. నియోజకవర్గంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మాకు తెలుసు. నేను పోటీలో ఉన్నా.. నా కుమారుడు బరిలో ఉన్నా ఒకటే. దీనికి ఎందుకు పితలాటకం” అని కృష్ణాజిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఇక, శ్రీకాకుళంలోనూ ఇదే వాయిస్ వినిపిస్తోంది. పార్టీ గెలుపు కోసం అందరం కష్టపడతాం. కానీ, ఈసారి మేం పోటీ చేయాలని అనుకోవడం లేదు. అని ఒకరు వ్యాఖ్యానించారు.
దీంతో ఈ విషయం సీఎం జగన్‌కు ఒకింత ఇబ్బందిగానే పరిణమిస్తుందని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోనూ వారసుల గోల ఎక్కువగా వినిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే వారసులకు ఆయన ఎక్కువగా టికెట్‌లు ఇచ్చారు. అయితే.. వీరిలో ఒక్క ఆదిరెడ్డి భవానీ తప్పమిగిలిన వారసులు ఓడిపోయారు. పోనీ.. ఇప్పటికైనా వారిగ్రాఫ్ బాగుపడిందా? అంటే.. చెప్పడానికి కొంత కష్టమైన పరిస్థితి ఉంది. కొందరు బయటకు వస్తున్నారు. మరికొందరు రావడం లేదు. దీంతో వారసులకు టికెట్లు ఇస్తే.. ఏం జరుగుతుందోనని చంద్రబాబు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
అలాగని వారసులకు టికెట్లు ఇవ్వకుండా ఉండలేని ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితి టీడీపీలో కనిపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలు కూడా వారసుల విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు రాకపోయినా.. చాలా చోట్ల వారి వారసులు చక్రం తిప్పుతున్నారు. ఇదే వారు టికెట్లు డిమాండ్ చేసేందుకు ప్రధాన కారణంగా ఉంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 28, 2022 9:15 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…