రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఒక నియోజకవర్గంంలో అసలు పొలిటికల్ పరిస్థితి బాగో లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీలక నాయకుడు.. రాజకీయంగా దూరంగా ఉన్నారు. తనకు మంత్రి పదవి వస్తందని.. భావించిన ఆయన.. రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇతరత్రా సమస్యలతో రాజకీయంగా దూకుడు చూపించలేక పోయారు. పైగా వచ్చే ఎన్నికల్లో వారసుడిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే.. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని.. సీఎం జగన్ స్పష్టం చేసేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో… సదరు ఎమ్మెల్యే తల్లడిల్లుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఆయన… నియోజకవర్గం మొహం చూసింది లేదు. కేవలం వారసుడిని మాత్రమే రంగంలోకి దింపారు. ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగినా.. కేవలం ఏడాదిన్నర సమయంలో నియోజకవర్గం సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదు. దీంతో .. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టీడీపీ కొంత మేరకు శ్రమిస్తే.. విజయం దక్కడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి..
అదే.. నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. నూజివీడులో టీడీపీ ఊపు అస్సలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీ చేసి.. గట్టి పోటీనే ఇచ్చారు. దాదాపు 95 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయి. కానీ.. ఎన్నికల తర్వాత.. ఆయన ఊసు ఎక్కడా వినిపించడం లేదు. ఏదో.. కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. మరి ఇప్పటి నుంచి ఆయన పుంజుకుంటే.. ఇక్కడ గెలిచే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
వైసీపీ తరఫున గెలిచిన అప్పారావు.. 2014లో ఒకింత ఊపు చూపించారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయన కుమారుడిని ఇక్కడ రంగంలొకి దింపాలని అనుకున్నారు. కానీ,ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మరి ఈ సమయంలో టీడీపీ పుంజుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉందని.. పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని మాత్రం వారు కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే సమాచారం సేకరించిన చంద్రబాబు.. అభ్యర్థి కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో.. ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.
This post was last modified on October 29, 2022 7:28 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…