Political News

వైసీపీ, టీడీపీల్లో ఇదో పెద్ద‌ క‌ల్లోలం.. అంతా డోల‌యామానం..!

మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు స‌మీపించ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలుపు గుర్రం ఎక్కేందుకు అధికార వైసీపీ ఇప్ప‌టి నుంచే వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగుతోంది. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా.. వ్యూహాల‌ను తెర‌మీదికి తెస్తోంది. అయితే.. అధిష్టానాల ప‌రంగా.. ఈ రెండు పార్టీలు దూకుడుతోనే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం.. ఈ రెండు పార్టీల నాయ‌కులు.. మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. త‌మ‌కు టికెట్ వ‌స్తుందో.. రాదో. అనే దిగులుతోనూ ఉన్నారు. వైసీపీలో అయితే.. జ‌గ‌న్ స్ప‌ష్టంగా చెబుతున్నారు.

ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కులే టికెట్లు ఇస్తున్నామ‌న్నారు. త‌ర్వాత‌.. మ‌ళ్లీ.. ప్ర‌జ‌లు ఆమోదించే నేత‌ల‌కే ప‌ట్టం క‌డ‌తామ‌న్నారు. దీంతో తాము ప్ర‌జ‌ల్లో ఉన్నా.. చివ‌ర‌కు స‌ర్వేలు చేయించిన త‌ర్వాత‌.. త‌మ‌కు అనుకూలంగా ఉంటేనే.. టికెట్లు వ‌స్తాయ‌ని.. నాయ‌కులు మాన‌సికంగా రెడీ అయ్యారు. అయితే.. దాదాపు 50 మంది నాయ‌కులు.. మాత్రం.. త‌మ‌కు టికెట్లు వ‌స్తాయో.. రాదా.. తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. ఇలాంటివారిలో మాజీ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌, ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి.. వంటివారు కూడా ఉండడం గ‌మ‌నార్హం.

దీంతో ఇలాంటివారు ముందుగానే.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల‌ని.. కోరుతున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఆరు మాసాల‌కు ముందు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. దీంతో నాయ‌కులు త‌ల్లడిల్లుతున్నారు. త‌మ‌కు టికెట్లు రాక‌పోయినా.. వేరే ప్ర‌త్యామ్నాయాలు చూసుకునే స‌మ‌యం ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఇక‌, ఇదే విష‌యంపై టీడీపీ నేత‌లు కూడా.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని.. ఇప్ప‌టికే స్ప‌ష్టంగా వినిపిస్తున్న‌వాద‌న‌.

దీంతో ఆ 40 మంది ఎవ‌రు? ఎక్క‌డా.. ముందుగానే తేల్చేయాల‌ని కోరుతున్నారు. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం.. ముందు తేల్చం.. ముందు.. మీరు ప్ర‌జ‌ల్లో ఉండండి.. అని చెబుతోంది. దీంతో వారిలోనూ ఇదే చ‌ర్చ సాగుతోందిఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు.. అంటే.. అప్పుడు కూడా ప్ర‌క‌టిస్తారో లేదో చెప్పడం క‌ష్ట‌మ‌ని.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్ల‌కు వారం వ‌ర‌కు.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూనే ఉన్నార‌ని.. ఇప్పుడు కూడా అలానే చేయ‌డం ద్వారా..త‌మ‌కు అవ‌కాశం లేకుండా పోతుందా? అనే చ‌ర్చ జోరుగా చేస్తున్నారు. ఏదేమైనా రెండు పార్టీలు కూడా.. త‌మ అభ్య‌ర్థుల‌ను డోలాయ‌మానంలో ప‌డేశాయ‌న్న‌దివాస్త‌వం.

This post was last modified on October 25, 2022 4:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDPYSRCP

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago