Political News

గుడివాడ‌పై ప‌ట్టు స‌డులుతోందా… మాజీ మంత్రిలో క‌ల‌వ‌రం..!

ఆయ‌న నోరు విప్పితే.. నిప్పులు రాల‌తాయి.. ఆయ‌న మీడియా ముందుకు వ‌స్తే.. విప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల శ‌త‌ఘ్నులు పేల‌తాయి. పెద్ద‌గా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు.. గుడివాడ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని. తిరుగులేని దూకుడుతో గ‌త నాలుగు ఎన్నిక‌ల నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు నాని. అదృష్టమో.. నోరో క‌లిసి వ‌చ్చి.. ఆయ‌న‌కు జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రి ప‌ద‌వి కూడా వ‌రించింది. అయితే.. ఇప్పుడు అదే నానిలో ఓ పావ‌లా సైజులో.. క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిజానికి త‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టే మొన‌గాడు కూడాలేర‌ని.. నాని ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే. . రోజులు అన్నీ ఒకేలా ఉండ‌వు క‌దా.. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. నాని దూకుడుకు అడ్డు క‌ట్ట వేయాలనేది . ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం టీడీపీ నిర్ణ‌యం. అయితే.. ఈ పార్టీ ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నా.. ఇది సాధ్యం కావ‌డం లేదు. దీంతో నాని పై చేయిసాధిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ గేర్ మార్చింది. బ‌ల‌మైన నాయ‌కుడిని రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈయ‌న ఆర్థికంగా.. కోటీశ్వ‌రుడు కావ‌డంతోపాటు.. పారిశ్రామికంగా.. దేశంలోనే మంచి పేరున్న వ్య‌క్తిగా టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌నకు టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు కూడా.. రెడీ అయ్యార‌ని అంటున్నారు. ఏడాది ముందుగానే నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్ట‌డంతోపా టు.. ఇక్క‌డ భారీ ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు, రైతుల‌కు అండ‌గా నిలిచే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక‌, ఈ విష‌యం తెలిసిన కొడాలి గూటిలో క‌ల‌వ‌రం ప్రారంభ‌మైంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు నోరేసుకుని గెలిచామ‌నే వాద‌న ఉంది.

లేదా.. కొంద‌రిని ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనేజ్ చేసుకుని విజ‌యం ద‌క్కించుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు లోక‌ల్‌గా పోటీ చేసిన టీడీపీ నేత‌లు అంద‌రూ.. కూడా నానితో సంబంధాలు ఉన్న‌వారే. కానీ.. ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన టీడీపీ నేత‌.. కృష్ణాజిల్లాకు చెందిన వారే అయినా.. నానితో సంబంధాలు లేవు. దీంతో ఆయ‌న‌తో మిలాఖ‌త్ అయ్యే అవ‌కాశం లేదు. పైగా.. టీడీపీ+జ‌న‌సేన కూడా.. ఈ ద‌ఫా గుడివాడ‌ను పోటాపోటీగా తీసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు గెలిచార‌నేది ప్ర‌ధానం కాదు.. టీడీపీ అయినా.. జ‌న‌సేన అయినా.. ఇక్క‌డ గెలిచి తీరాల‌నే ల‌క్ష్యంతో ఉన్నాయి. దీంతో ఈ విష‌యం తెలిసి.. కొడాలి వ‌ర్గం.. క‌ల‌వ‌రంలో ప‌డింద‌నే టాక్ వినిపిస్తోంది.

This post was last modified on October 22, 2022 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

7 hours ago