ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత రాత్రి నుంచి(ఆదివారం) ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ రాజధారి రైతులు.. నిర్వహిస్తున్న మహాపాదయాత్ర 2.0 నేడు.. రాజమండ్రిలోకి అడుగు పెట్టనుంది. అయితే.. దీనిని అడ్డుకుని తీరుతామని.. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ప్రకటనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి బ్రిడ్జిపై.. రాకపోకలను నిషేధించారు. రిపేర్ పేరుతో.. బ్రడ్జిని మూసేశారు. అయినప్పటికీ.. పాదయాత్ర కొనసాగించి తీరుతామని.. అవసరమైతే.. పడవల ద్వారా.. నదిని దాటుతామని..రైతులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు.. టీడీపీ యువ నాయకులు.. పరిటాలశ్రీరామ్(అనంతపురం), వంగవీటి రాధా(విజయవాడ), గంటి హరీష్(అమలాపురం) వంటివారు.. పాదయాత్రలో అడుగులు వేసేందుకు ముందుకు వచ్చారు. ఆదివారం సాయంత్రమే రాజమండ్రికి చేరుకున్నవారు ఓ హోటల్‌లో బస చేశారు. అనంతరం.. ఈ రోజు ఉదయం.. పాదయాత్రలో పాల్గొనేందుకు బయటకు వచ్చారు. వీరికి.. టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు కూడా.. సంఘీభావం తెలిపారు. వీరంతా.. పాదయాత్రకు వెళ్లేందుకు రెడీ కాగా.. పోలీసులు చుట్టుముట్టారు.
పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో పోలీసుల అడ్డును తప్పించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీసులు అరెస్టులు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నాయకుడు.. కోనేరు మురళి ఇంటి వద్ద నుంచి బయలు దేరిన వంగవీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్యకర్తలు సైతం.. భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు తమకు సహకరించి..ఇళ్లలోకి వెళ్లిపోవాలని.. లేక పోతే.. అరెస్టులు తప్పవని హెచ్చరించారు. దీంతో రాజమండ్రి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో .. అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
This post was last modified on October 17, 2022 1:04 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…